అమరావతి రాజధానిలో వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాల నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో అన్ని సంఘాల జె.ఏ సి నాయకుడుగా వ్యవహరిస్తున్న ఓ పెద్దాయన ఇలా ఉపన్యసిస్తున్నాడు.
రైతు నాయకులు, డ్వాక్రా మహిళా సంఘాల నాయకులు, చేనేత నాయకులు, ఇంకా వివిధ కుల సంఘాల నాయకులు.... మీ అందరికి ఇదే విజ్ఞప్తి.. నాయకులు సంయమనం పాటించాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మనకు గొడవొద్దు... ఓర్పు..సహనంలో ఆయన్నే ఆదర్శంగా తీసుకుందాం.. ఆయన్నే ఫాలో అవుదాం.. ఎన్నికల్లో మనకు ఇచ్చిన హామీల అమలు కోసం చివరి వరకు ప్రయత్నం చేద్దాం. ప్రజల ప్రయోజనాల విషయంలో రాజి పడొద్దు. ఎంతవరకయినా వెళదాం. హామీల అమలు కోసం సుప్రీం కోర్టుకు వెళదాం. ఆవేశపడితే ప్రయోజనం లేదు... మనం తిరగబడితే ప్రజలు సహనం కోల్పోయి రెచ్చిపోతారు. మనం చివరిదాకా అన్ని ప్రయత్నాలు చేద్దాం. అప్పటికి హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారికి ఓ పెద్ద దండం పెట్టేద్దాం. అన్నింటా మనకు చంద్రబాబే ఆదర్శం... జై చంద్రబాబు... జైజై చంద్రబాబు.
దాంతో సమావేశం ఆ పెద్దాయన చెప్పినదానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇదండీ సంగతి... అనంతరం సమావేశానికి హాజరైన వేలాదిమంది ఒక్కసారిగా పెద్దపెట్టున నినదించారు... జై చంద్రబాబు... జైజై చంద్రబాబు.

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి