Translate

  • Latest News

    20, ఏప్రిల్ 2018, శుక్రవారం

    12 గంటల దీక్షకు 12 కోట్లా...


    ప్రతిపక్షాలు దీక్షలు, బంద్లు చేస్తే వేస్ట్ అన్నావు.... మొన్నటి బంద్ వల్ల ఆర్టీసీ కి 12 కోట్లు నష్టం అన్నావు...  మనలని మనమే నష్టపరుచుకోవడం తప్పు... జపాన్ తరహా ఎక్కువ పని చేసి నిరసన తెలపాలన్నావు. నిజమే.. భలే చెప్పాడు మన చంద్రన్న అనుకున్నా... శభాష్ లీడర్ అంటే ఆదర్శవంతంగా  ఇలా ఉండాలనుకున్నా... ఇంతలోనే ఇలా నువ్వు చెప్పిన మాట నువ్వే తప్పావు ఏమిటన్నా... దీక్షలు వద్దని చెప్పినోడివి... నువ్వే దీక్షకు కూర్చున్నావేమిటన్నా... పైగా నీ దీక్షకు ద్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలను  మూడు జిల్లాల నుంచి తరలించడానికి 1490 ఆర్టీసీ బస్సులు బుక్ చేశావంటే... అసలే పెళ్లిళ్ల సీజన్లో నువ్వు ఇన్ని ఆర్టీసీ బస్సులు  తీసేసుకుంటే జనాలు ఎంత అవస్థలు పడతారో కదా. ఇది కాక 2000 విద్యాసంస్థల బస్సుల్లో , కాలేజీ స్టూడెంట్స్ ను తరలించామన్నావంటా... వేదిక దగ్గర ఖర్చే 2 కోట్లు అయిందంట. పరుపులు, కూలర్లు, సౌండ్ సిస్టం, ఇవికాక వచ్చిన వారికి అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లు. అన్నట్టు మజ్జిగ పాకెట్లు అంటే గుర్తొచ్చింది.. అవి కూడా మీ హెరిటేజ్ వాళ్ళవే కదా... అంటే ప్రభుత్వ ఖజానా లొంచి  సొమ్ము తీసి ఈ విధంగా మీ ఆవిడ హ్యాండ్ బాగ్ లో వేస్తున్నావన్న మాట... అబ్బా ఏమి తెలివితేటలు బాబూ... నిజంగా నువ్వు గ్రేట్... మళ్ళి ఈ కార్యక్రమం అవగానే ప్రభుత్వం తరపున వేసవి చలివేంద్రాలు పెడతావు... మీ హెరిటేజ్ మజ్జిగ పంపిణి చేస్తావు... మళ్ళీ మా సొమ్ము... అదే ప్రభుత్వ సొమ్మును మీ ఆవిడ హ్యాండ్ బాగ్ లోకి పంపుతావు కదా... సరే ఇప్పుడు దీక్ష విషయానికి వద్దాం... వేదిక వద్ద ఖర్చు 2 కోట్లు... ఆర్టీసీ బస్సులు 1490... ఒక్కొక్క దానికి 14000 చొప్పున మొత్తం 2 కోట్లు...షిఫ్ట్ కు 20 వేల మందికి తక్కువ కాకుండా. మూడు షిఫ్ట్ లకు  కనీసం 60 వేల   మందిని తరలించాలని ప్లాన్... వచ్చిన వారికి అల్పాహారం ఖర్చు ఒక్కొక్కరికి 30 లక్షలు. ఈ ఏర్పాట్లకు, బందోబస్తుకు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే అదనపు వేతనం 1.20 కోట్లు..  ఇది కాక 13 జిల్లాల్లో దీక్షలు చేయమన్నావంట. జిల్లాకి 50 లక్షలు ఖర్చు వేసుకున్నా ఆడో 6.50 కోట్లు వెరసి మొత్తం 12 కోట్లు... అంటే బాబు గారి 12 గంటల దీక్షకు 12 కోట్లు ఖర్చు.... బాబు గారు... ఇదేమిటి సారూ... 
    ఇట్లు 
    ఒక సామాన్యుడు 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 12 గంటల దీక్షకు 12 కోట్లా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top