పులి మేక తోలు కప్పుకుని మేకల మందలో చేరి గప్ చిప్ గా ఒక్కొక్క మేకను మింగేసినట్టు... 2014 ఎన్నికల్లో బి.సి. కార్డు పెట్టుకుని, చాయ్ వాలానంటూ... చెప్పి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇప్పుడేమో కోట్ల విలువైన కోట్లు ధరిస్తూ, కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మేక వన్నె పులి గుజరాత్ లో ముఖ్యమంత్రి గా ఉండగా వేలాది మంది ముస్లిం లను ఊచకోత కోయించి ప్రధాన మంత్రి అయి ఇప్పుడు దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు అందరిని తడి గుడ్డతో గొంతు కోస్తున్నాడు. (డీజిల్, పెట్రోల్ ధరలు పెంచినట్టు తెలియకుండా పెంచడం తడి గుడ్డతో గొంతు కోయడమే మరి...) ఈయన గారు ఈ రోజు (ఏప్రిల్ 12) దీక్ష చేస్తారట. ఎందుకయ్యా...అంటే పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జరగనీయకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని అట. ఔరా... ఏమి దొంగ నాటకాలు... మోడీ దీక్ష చేయడం అంటే కొంగ జపం చేయడమే...పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి అనుమతించకుండా దాటవేస్తే... విధి లేని పరిస్థితుల్లో వై.కా.పా ఎం.ఎల్.ఏ లు ఆమరణ దీక్షకు కూర్చుంటే కనీసం మాట వరసకు కూడా పలకరించని మోడీ... అసలు ఏమి జరగనట్టు... వ్యవహరిస్తున్న మోడీ... ఇప్పుడు అమాయకుడిలా నటిస్తూ దీక్ష చేస్తానంటున్నాడు. మేక తోలు కప్పుకుని వచ్చినంత మాత్రాన పులి మేక అయిపోతుందా... కొంగ జపం చేస్తున్నానంటే నమ్మడానికి ప్రజలు ఆ కధలో చేపలు కాదు. చాకులు... ఈ చాకులే రేపటి ఎన్నికల్లో విచ్చు కత్తులై ప్రజలను మోసం చేసిన రాజకీయ పార్టీల గుండెల్లో దిగుతాయి...జాగ్రత్త...
12, ఏప్రిల్ 2018, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి