కుక్కను చంపాలనుకుంటే పిచ్చి కుక్క అని ముద్ర వేస్తె సరి. జనమే రాళ్లు వేసి కొట్టి చంపుతారు. ఈ సిద్దాంతాన్ని బాగా అవగాహన చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలుచేసి విజయం సాధించారు. అందరూ అనుకునేటట్టు చంద్రబాబును గెలిపించింది రుణ మాఫీ కాదు...బి.జె.పీ సపోర్ట్ కాదు... పవన్ కళ్యాణ్ సపోర్ట్ కాదు... లేదా కొత్త రాజధాని లో సమర్థుడైన, అనుభవమున్న నాయకుడు కావాలని కాదు... ఇవన్నీ కొంత మేరకు పనిచేసిన మాట నిజమే కానీ. వీటన్నిటిని మించి పనిచేసిన ఒక అస్త్రం చాలా బలంగా పనిచేసింది. జగన్ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే లక్ష కోట్లు మింగాడని... ఇక ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తే మొత్తం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేస్తాడని... జగన్ ను గెలిపిస్తే కడప రౌడీలు కోస్తాను కూడా రాయలసీమగా మారుస్తారని... వైజాగ్ లో విజయమ్మకు ఓటు వేస్తే వైజాగ్ మొత్తాన్ని కడప రౌడీలు కబ్జా చేస్తారని... ఇలా సక్సెసుఫుల్ గా ప్రచారం చేశారు కాబట్టే గెలిచారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పై ఏ ఏ ఆరోపణలు చేసాడో... అవన్నీ తానే స్వయంగా చేస్తున్నాడు... రాష్ట్రాన్ని విదేశాలకు తాకట్టు పెట్టేస్తున్నాడు. ఇక బాబు గారి సుపుత్రుడిని ఏకంగా మంత్రిని చేసేసి... రాష్ట్రాన్ని దోచుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ సారి పాలనలో విశేషం ఏమిటంటే... తనతో పాటు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా తెలుగుదేశం పార్టీ లీడర్లకు కూడా దోచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దోచుకున్న సొమ్ముతోనే వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని మరి పార్టీ నేతలకు ఉద్బోధిస్తున్నారు.
ఇలా ఉంటె ఈ సారి తన సొంత పార్టీ లోనే కొంత మంది నాయకుల మీద ఆయనకు విరక్తి పుట్టింది. వారికి ఎం.ఎల్.ఏ టిక్కెట్లు కూడా ఇచ్చే ఉద్దేశం లేదు. అందుకే తన పిచ్చి కుక్క సిద్దాంతాన్ని ఈ సారి తన సొంత పార్టీ మంత్రులు, నాయకుల మీదే అమలు చేస్తున్నాడు. ఆ బలి పశువుల్లో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. తన ప్లాన్ అమలులో భాగంగా ముందుగా వారి గురించి నెగటివ్ గా తన అనుంగు పుత్రిక ఆంధ్ర జ్యోతి... కాదు..కాదు చంద్ర జ్యోతి లో రాయిస్తున్నాడు. తర్వాత ఆ సాకు చూపించి వారికి టిక్కెట్లు ఎగ్గొట్టేస్తాను. ఆ స్థానాల్లో కొత్త వారికి టిక్కెట్లు ఇస్తారు. ముందుగా ఈ వరుసలో మంత్రి గంటా శ్రీనివాస రావు పేరు బయటకు వచ్చింది. గంటా ను తప్పించి అక్కడ ఈ సారి అక్కడ ఆంధ్ర ప్రభ పత్రిక అధినేత ముత్తా గోపాలకృష్ణ కు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు హిల్ లిస్టులో ఇంకా చాలా మంది ఉన్నారు. బహుశా నెక్స్ట్ పేరు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుది కావచ్చు. చంద్రబాబు కు ఈ సారి చిలకలూరిపేటలో పుల్లారావు కు టిక్కెట్ ఇచ్చే ఉద్దేశం లేదు. ఆయనపై కూడా చంద్ర జ్యోతిలో ఇలాగే రాయిస్తారు. పేటలో ఈ సారి బహుశా లోకేష్ పోటీ చేసే అవకాశాలున్నాయి. లోకేష్ ను రాజధాని ప్రాంతం లోని కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించి ఎం.ఎల్.ఏ గా గెలిపించాలనేది ప్లాన్. లోకేష్ దగ్గర పి. ఏ గా పనిచేస్తున్న వ్యక్తి చిలకలూరిపేట సమీపం లోని గణపవరం కు చెందిన వ్యక్తి. అతని సలహా మేరకు లోకేష్ పేట మీద కన్నేశాడని సమాచారం. ఒక వేళ లోకేష్ కాకపొతే... గణపవరం కే చెందిన ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న యువ మహిళా పారిశ్రామికవేత్త సామినేని యామినీ చౌదరి కి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి