బాబు గోరికి తన మీద తనకు నమ్మకం సడలిందా... ఇప్పుడు ఆయన పార్టీని గెలిపించడానికి ఒక రాబిన్ శర్మ కావలిసివచ్చాడా... అవును వయసయిపోతోంది కదా... 70 వ పడిలో పడ్డాడు కదా... కొడుకు లోకేష్ ఏమో పప్పు సుద్ద అంటున్నారయ్యే... మరి ఎవరో ఒకరి ఆసరా అవసరమే అన్నాడు మా బామ్మర్ది సత్తిబాబు... ఓరి పిచ్చోడా... ఆయన మొదటి నుంచి ఎవరో ఒకరి ఆసరాతోనే గెలుస్తూ వచ్చాడే తప్ప... ఆయన సొంత పనితనం ఏమీ లేదురా సత్తిబాబు అన్నాన్నేను... అదేమిటి... చంద్రబాబు...అపర చాణక్యుడు అంటారు కదా.... ఆయన్ను మరీ అలా తీసిపారేసినట్టు మాట్లాడతావేమిటి అన్నాడు మా వాడు.. నీకు తెలియదురా... చంద్రబాబు పేరుకు తగ్గట్టు నిజంగా చంద్రుడే... ఆయన స్వయంప్రకాశకుడు కాదు...ఎన్ టీ ఆర్ ను సూర్యుడిని రాహువులా మింగేసి... ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు... 1999 ఎన్నికల్లో బీజేపీ అనే సూర్యుడి వెలుగుతో ప్రకాశించాడు... 2014 ఎన్నికల్లో మళ్ళీ అదే బీజేపీ కి తోడు పవన్ కళ్యాణ్ అనే మరో సూర్యుడు కూడా కలిసొచ్చి గెలిచాడు.. ఈ విధంగా గెలిచిన ప్రతి ఎన్నికల్లోనూ ఎవరో ఒక సూర్యుడి వెలుగులోనే ఈ రాజకీయ చంద్రుడు ప్రకాశిస్తూ వచ్చాడు... మొన్నటి ఎన్నికల్లో ఆ వెలుగులేవీ ప్రసరించక... పాపం... మన చంద్రబాబు గారు చీకట్లో ఉండిపోవాల్సివచ్చింది... అదన్న మాట సంగతి.... మొన్న ఎన్నికల్లో ఓడిపోయాక మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడం లేదని పాపం బాబుగోరు తెగ మధనపడిపోయారు... ఆ తర్వాత జ్ఞానోదయమైనట్టుంది... జగన్ ను గెలిపించింది జనం కాదని... ప్రశాంత్ కిశోర్ అని... అందుకే వెంటనే ప్రశాంత్ కిశోర్ ని కాంటాక్ట్ చేశాడు... ఆయన నో... చెప్పేసరికి... ఆయన దగ్గర పనిచేసి...కొత్తగా సొంత దుకాణం పెట్టుకున్న రాబిన్ శర్మను లైన్లో పెట్టాడు... ఇప్పుడు బాబు గోరికి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని ఆ పార్టీ కార్యకర్తలు తెగ సంబరపడి పోతున్నారు... అదీ నిజమే ఈ మధ్య సోషల్ మీడియా లో టీడీపీ దూకుడు ఎక్కువైనది... జగన్ పార్టీ ఈ విషయంలో వెనుకపడింది... టీడీపీ ఇస్తున్న స్ట్రోక్ లకు కనీసం కౌంటర్లు కూడా ఇవ్వలేకపోతోంది... ఇలా అయితే కష్టమే... వై.ఎస్.ఆర్.సీపీ శ్రేణులు కూడా కాస్త ఎలర్ట్ అవ్వాలి మరి... లేకపోతే వచ్చే ఎన్నికల్లో జనం ఈ సోషల్ మీడియా మాయాజాలంలో పడి రాబిన్ శర్మ టీమ్ పోస్టింగులు నమ్మేసి బాబును గెలిపించేస్తారేమో.... ఏమో...మరి.. అసలు ఇంతకూ చంద్రబాబు కు రాబిన్ శర్మకు ను. కోట్ల డీల్ నిజమేనా... అది అబద్దం అని టీ డీ పీ వర్గాలు ఖండిస్తున్నాయి... ఒకవేళ నిజమైతే... ఎన్నికలు జరిగితే పోటీ జగన్...చంద్రబాబు మధ్యా... లేక ప్రశాంత్ కిశోర్...రాబిన్ శర్మ మధ్యా...
అది జనమే చెప్పాలి....
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి