Translate

  • Latest News

    20, ఏప్రిల్ 2020, సోమవారం

    71 వ ఏట కూడా 17 ఏళ్ల కుర్రాడిలా చంద్రబాబు


    తెలుగు నాట అత్యంత సీనియర్ రాజకీయ వేత్త, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి గొప్ప పరిపాలనాదక్షుడిగా, అపర చాణుక్యుడిగా  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు నేటితో (ఏప్రిల్ 20) 70 ఏళ్ళు పూర్తి చేసుకుని 71 వ ఏట అడుగుపెట్టారు. 71 వ ఏట సైతం 17 ఏళ్ల కుర్రవాడిలా నిత్యం యవ్వనోత్సాహంతో చురుకుగా ఉండడం చూస్తే ఒకింత ఆశ్యర్యంగానే ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ వేత్తకు దక్కనటువంటి రికార్డు చంద్రబాబుకు ఉంది. అత్యధిక కాలం(14 ఏళ్ళు) రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.  . విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా కూడా మరో రికార్డు ఉంది.   రాజకీయాలలో 42 ఏళ్ల సీనియారిటీతో క్రైసిస్ మానేజ్ మెంట్ లో దిట్టగా పేరు గడించిన చంద్రబాబు 40 ఏళ్ల కిందట ఎలా ఉన్నారో... యిప్పటికీ అదే ఫిజిక్ ను మెయింటేన్ చేస్తుండడం చెప్పుకోదగ్గ విషయం. ఇంతకీ చంద్రబాబు ఆరోగ్య రహస్యమేమిటి...

    40 ఏళ్ల కిందట ఎలా ఉన్నారో...ఇప్పుడు అదే బాడీ మెయింటేన్ ఎలా చేయగలుగుతున్నారు... ఆ... తెలిసింది... మీరు రోజూ యోగా చేస్తారు కదూ... అదేనా మీ రహస్యం... కేవలం అదొక్కటే కాదు... ఇంకేదో ఉంది... మీ ఆధ్యాత్మిక స్నేహితులు బాబా రాందేవ్ మీకు ఏదో నిత్య యవ్వనంగా ఉండే గుళికలో...మూలికలో ఏదో ఇచ్చి ఉంటారు కదూ... అంతేనా...

    లేకపోతే సద్గురు జగ్గీ వాసుదేవ్ మీ చెవిలో ఏదయినా రహస్య ఉపదేశం చేశారా... మాకు మాత్రం అదే అనిపిస్తోంది... లేకపోతే  70 ఏళ్ళు నిండినా ఇంత  ఆరోగ్యంగా ఎలా ఉంటారు... ఆ రహస్యం ఏమిటో అందరికి చెబితే...రాష్ట్రంలో అందరూ మీ లాగా ఆరోగ్యంగా ఉంటారు కదా... బాబు గారూ... మాకు చెప్పకపోతే పోయారు...కనీసం మీ అబ్బాయి లోకేష్ కయినా ఆ రహస్యం కాస్త చెప్పండి... లోకేష్ బాబు తెలివితేటల సంగతి ఎలా ఉన్నా... ముందు ఈ  వయసులో... ఆ బాడీ చూడలేకపోతున్నాం సారూ... సరే... మీ అబ్బాయి సంగతి మీకు మేము వేరే చెప్పాలా... ఎదో ఉండబట్టలేక వాగేశాం. క్షమించండి సారూ... ఏది ఏమయినా  మీకు హాపీ బర్త్ డే సారూ... మీరు ఇలాగే నిండు నూరేళ్లు నిత్య యవ్వనంగా జీవించాలి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 71 వ ఏట కూడా 17 ఏళ్ల కుర్రాడిలా చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top