Translate

  • Latest News

    21, ఏప్రిల్ 2020, మంగళవారం

    వీడియోలు చూసి మ‌ద్యం త‌యారీ


    లాక్‌డౌన్ కారణంగా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. నిత్యావసరాలు తప్ప మిగతా దుకాణాలన్నీ మూతపడిపోయాయి. దీంతో ముఖ్యంగా మందు బాబులు తెగ ఇబ్బందులు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఇద్దరు మిత్రులు అతితెలివి చూపించారు. ఆన్‌లైన్లో వీడియోలు చూసి సొంతగా ఇంట్లోనే లిక్కర్ తయారుచేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నమక్కల్‌లో జరిగింది. ఇటీవల రాష్ట్రంలో అక్రమంగా లిక్కర్ తయారు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని పోలీసులు తెలిపారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వీడియోలు చూసి మ‌ద్యం త‌యారీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top