Translate

  • Latest News

    26, ఆగస్టు 2017, శనివారం

    మా గురించి ......

    మా గురించి ......


    భిన్న మతాలు, భిన్న కులాలు, విభిన్న సంస్కృతులతో ఉన్న భారత దేశంలో భిన్న స్వరాలు వినిపించటం సహజాతి సహజం. కాని పాలకుల వైఖరి ఏకధ్రువపాలనగా సాగుతోంది. నాలుగు పడగల హైందవ నాగరాజు తల ఊపే నాదస్వరం తప్ప మ రే స్వరం వినిపించటానికి వీలులేదంటూ అప్రకటిత నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.ఏడు రంగులు కలిస్తే ఇంద్రధనస్సు అయినట్లు, సప్తస్వరాలు కలిస్తేనే మనోల్లాస సంగీతమైనట్లు , భిన్న స్వరాలు వినిపిస్తేనే కదా భావప్రకటన స్వేచ్చ వికసిందేది. స్వరం బయటకు రాకుండా అల్పసంఖ్యాక వర్గాల గొంతు వామన పాదంతో తొక్కిపెడుతుంటే అభ్యుదయ వాదులంతా గొంతు పిక్కటిల్లేలా ఒక్కటే భిన్నస్వరాలు వినిపించే సమయం ఆసన్నమైంది.  మాకంటూ   ప్రత్యేకించి ఏ వర్గంపైనో  సమూహంపైనో  ప్రత్యేకమైన ద్వేషం, ప్రేమలు లేవు.సమాజానికి మేలు చేసే ఏ సమాచారమైనా మేము ప్రజలకు చేరువయ్యేలా చేస్తాం. ఈ క్రమంలో ఏమైనా తప్పలు జరిగితే , తప్పడు సమాచారం పొరపాటున దొర్లినా సరిచేసుకోవటానికి సిద్దంగా ఉన్నాం. ఈ క్రమంలో మీ సలహాలు, సూచనలు కోరుతున్నాం. మీ సలహాలు ,సూచనలు  మా మెయిల్ ......bhinnaswaralu@gmail.com కు పంపాలని కోరుతున్నాం.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మా గురించి ...... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top