Translate

  • Latest News

    20, సెప్టెంబర్ 2017, బుధవారం

    అధికార పార్టీల ఆయుధాలుగా ఫోన్ టాపింగ్ .. తాజాగా కర్నాకటలో పోన్ ల టాపింగ్ వివాదం


    కర్నాకటలో పోన్ ల టాపింగ్ వివాదం నడుస్తోంది.కేంద్ర ప్రభుత్వం తమ పోన్ లను టాప్ చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే, రాస్ట్ర ప్రభుత్వం తమ పోన్ లను టాప్ చేస్తోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదో వివాదంగా మారనుంది గతం నుంచి పోన్ ల టాపింగ్ వివాదం ఉంది. తెలుగు రాష్ట్రాలు విడి పోయన అనంతరం ఓ టు కు నోటు  వ్యవహారం లో ఫోన్ టాపింగ్ విషయం దుమారం రేపింది .   రేవంత్  కేసు విషయంలో  తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.  ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫోన్ టాపింగ్ చేయడం  పెద్ద నేరం అంటూ  కెసిఆర్ పై  నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఇరికిస్తే ఇరికే  అంతా అమాయకుడివా అంటూ కెసిఆర్ బాబు పై తనదైన శైలిలో పంచ్ విసిరారు.    నీకు పోలీస్ ఉంది, నాకూ పోలీస్ ఉంది, నీకు ఏసిబి ఉంది నాకు ఏసిబి ఉందని  సవాలు విసిరారు.
     గతం లో  సమాజ్ వాది పార్టీ  ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ యొక్క టెలిఫోన్ టాప్ చేసారని అప్పట్లో దుమారం చెలరేగింది . అప్పటి రాష్ట్రపతి  ప్రెసిడెంట్ జైల్ సింగ్       రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ టెలిఫోన్లను టాప్ చేసినట్లు  ఆరోపణ లు వచ్చాయి  1988 లో రామకృష్ణ హెగ్డే ఫోన్ టాపింగ్ వ్యాహారం లోనే  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. . 1990 లో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న సమయం లో టెలిఫోన్ టాపింగ్ విషయంలో నే నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కుప్పకూలింది 
    , ముఖ్యంగా తీవ్రవాదం ప్రత్యక్ష ముప్పుగా ఉన్నప్పుడు. 1885 లో ఇండియన్ టెలీగ్రాఫ్ చట్టం "ప్రభుత్వ అత్యవసర పరిస్థితి" లేదా "ప్రజల భద్రత పట్ల ఆసక్తి కలిగించే సందర్భంలో వాటిని  అడ్డుకునేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తుంది." , సుప్రీం కోర్టు 1996 లో మార్గదర్శకాలను రూపొందించింది,  కేవలం 7 దర్యాప్తు సంస్థలకు మాత్రమే అధికారముంది. అది కూడా హోంశాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి తీసుకోవాలి. ఇందుకు దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు చూపించగలగాలి. అప్పడే ప్రభుత్వం అనుమతిస్తుంది. దీనిని కేబినెట్‌ కార్యదర్శి పరిశీలించాలి. టెలికమ్యూనికేషన్‌ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి కూడా పరిశీలించాలి. రెండు నెలల్లో అనుమతిపై తుది నిర్ణయం తీసుకోలేకపోతే మళ్లీ దరఖాస్తు చేయాలి. ఒకసారి ఫోన్‌ టాపింగ్‌ జరిగితే రెండు నెలల్లో ఆధారాలు సేకరించి టేప్‌ను ధ్వంసం చేయాలని నిబంధనలు ఉన్నాయి. ఒకసారి ఫోన్‌ టాపింగ్‌లో దర్యాప్తు సంస్థలు సేకరించిన సంభాషణలు భద్రంగా ఉంచాలి. వాటిని ఎవరూ వినడానికి అనుమతివ్వరు. కేసును పరిశీలిస్తున్న ఇద్దరుముగ్గురు అధికారులకు మాత్రమే వినేందుకు అనుమతిస్తారు. ఇలా ఫోన్‌ టాపింగ్‌ విషయంలో ఎన్నో కఠిన నిబంధనలున్నాయి.

    కానీ ప్రభుత్వాలు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకులు ఆయుధాలుగా వాడుకుంటున్నారు. కీలక కేసుల్లో సేకరించిన టాపింగ్‌ సంభాషణలు రహస్యంగా ఉంచాల్సిన అధికారులు లీక్‌ చేస్తున్నారు. టాపింగ్‌కు విచ్చలవిడిగా అనుమతులిస్తున్నారు. ఇందుకు రాజకీయ జోక్యమే కారణం. ప్రముఖుల ఫోన్లు టాపింగ్‌ చేసిన ఘటనలూ చాలా ఉన్నాయి. అందుకే ఏటా ఇన్ని లక్షల ఫోన్లు టాప్‌ అవుతున్నాయి.. అవుతూనే ఉంటాయి. 

                                                                                                                                                                                                                                                    -శ్రీహర్ష 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అధికార పార్టీల ఆయుధాలుగా ఫోన్ టాపింగ్ .. తాజాగా కర్నాకటలో పోన్ ల టాపింగ్ వివాదం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top