Translate

  • Latest News

    26, సెప్టెంబర్ 2017, మంగళవారం

    బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఉద్రిక్తత...వెయ్యి మంది విద్యార్ధులపై కేసులు నమోదు ...యూనివర్శిటీతో తెలుగువాళ్లకు ఒక ప్రత్యేక అనుబంధం


    విద్యకు  ఆనవాలు గా నిలవాల్సిన విశ్యవిద్యాలయాలు కదన రంగానికి మారుపేరుగా మారుతున్నాయి  . గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని  బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. తాజాగా  బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. క్యాంపస్‌లో లెఫ్ట్‌ పార్టీల విద్యార్థి సంఘాలు ర్యాలీ తలపెట్టాయి. ఈ ర్యాలీలో జేఎన్‌యూ నేత షీలా రషీద్‌ పాల్గొనడంపై ఏబీవీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశద్రోహులను తమ వర్శిటీలోకి రానివ్వమంటూ దాడికి ప్రయత్నించారు.  రెండు సంఘాల విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెనారస్ హిందూ యూనివర్శిటీలో వెయ్యి మంది విద్యార్ధులపై  కేసులు నమోదు చేయడం  దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనలపై యూనివర్శిటీ వైస్ చాన్సలర్ త్రిపాఠి మాట్లాడుతూ పోలీసులు విద్యార్థినులపై లాఠీ ఛార్జ్‌ చేస్తే అది సింపుల్‌ ఈవ్‌టీజింగ్‌ ఘటనని దీనిని రాజకీయం చేస్తున్నారని అన్నారట. ఇది మళ్లీ వివాదం అయింది.. మోదీ వారణాసికి వస్తున్నారని తెలిసే కావాలని ఇలాంటి ఘర్షణలను సృష్టించారని ఆయన ఆరోపించారు.. దీనిపై ప్రదాని మోడీ, బిజెపి అద్యక్షుడు అమిత సాలు ముఖ్యమంత్రి యోగి తో మాట్లాడి సమస్యను సాద్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.
    బెనారస్‌ యూనివర్శిటీతో తెలుగువాళ్లకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ యూనివర్శిటీలో చదివి గొప్పవారైన తెలుగువారి జాబితా చాలా పెద్దదే. అందుకే అనేకమంది రచనల్లో, ఆత్మకథల్లో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం పేరు తరచూ కనిపించి ఈ తరం వారిలోనూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది
    కొడవటిగంటి కుటుంబరావు చదువు నవలలో సుందరం పాత్ర బెనారస్‌లో చదువుకోవడానికి వస్తాడు. రైలు దిగి లంకకు (బిహెచయు మెయినగేట్‌ ప్రాంతం) వచ్చి అక్కడ రిక్షా ఎక్కి యూనివర్సిటీలోకి ప్రవేశించగానే మొదటి హాస్టల్‌లోని తెలుగు విద్యార్థులు చేతులు ఊపి అతనికి స్వాగతం పలికినట్లు ఉంది. కొ.కు. బి.హెచ.యు.లో చదువుకొన్న కారణంగా ఆ నవలలో అప్పటి విద్యార్థి ఉద్యమాల్ని, అక్కడి వాతావరణాన్ని, తనపై కలిగిన మార్క్సిస్ట్‌ ప్రభావాల్ని సుందరం పాత్ర ద్వారా తెలియజేస్తాడు.తరిమెల నాగిరెడ్డి తాను గాంధేయవాదిగా బెనారస్‌లో ప్రవేశించి మార్క్సిస్టు వాదిగా బయటకు వచ్చినట్టు చెప్పుకొన్నాడు. యూనివర్సిటీలో జరిగే విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొనడమే కాక అక్కడ విద్యార్థి సంఘ నాయకుడుగా కూడా ఎన్నికయ్యాడు. స్నాతకోత్సవ సభలో అప్పటి యూనివర్సిటీ వి.సి మాలవ్యను ఎదిరించి మాట్లాడాడని తెలుసుకొన్న గాంధీ క్షమాపణ కోరుకొమ్మని నాగిరెడ్డికి లేఖ రాస్తే దాన్ని ఆయన తిరస్కరించి విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళిపోయినట్లు ఆయనే చెప్పుకొన్నాడు. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ అయితే అక్కడ ఎన్ని ఆందోళనల్లో పాల్గొన్నారో లెక్కలేదు. ప్రతిసారీ ఆయన్ని తీసుకువెళ్ళి యూనివర్సిటీ గేట్‌ బయట వదిలి వస్తే మళ్ళీ పోలీసుల కళ్ళుగప్పి ఏదో విధంగా యూనివర్సిటీలోకి ప్రవేశించేవాడని చెప్పుకుంటారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఉద్రిక్తత...వెయ్యి మంది విద్యార్ధులపై కేసులు నమోదు ...యూనివర్శిటీతో తెలుగువాళ్లకు ఒక ప్రత్యేక అనుబంధం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top