Translate

  • Latest News

    24, సెప్టెంబర్ 2017, ఆదివారం

    రాజధాని నిర్మాణం ఇప్పట్లో తేలే వ్యవహారం కాదా ...?


    రానున్న పదేళ్లలో అమరావతి నగరానికి రూపురేఖలు ఏర్పడాలి. ఇల్లు కట్టుకోవాలన్నా ఏడాది రెండేళ్లు పడుతుంది. అలాంటిది రాజధాని నిర్మాణం అంటే ఆషామాషీ కాదన్న విషయాన్ని మనం కూడా అంగీకరించాలి. అలా అని ఏళ్లూపూళ్లూ గడుస్తున్నా పురోగతి కనిపించని పక్షంలో ఆతృత స్థానంలో విసుగు చోటు చేసుకుంటుంది. ఈ కారణంగా భవనాల ఆకృతుల విషయంలో తన మనస్సులో ఏమనుకుంటున్నారో చంద్రబాబు నార్మన్‌ ఫోస్టర్‌ బృందానికి స్పష్టం చేస్తే తుది డిజైన్లను వీలైనంత త్వరగా ఖరారుచేసి, నిర్మాణాలు మొదలుపెట్టడం వీలవుతుంది. అదే సమయంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తమకు కేటాయించబోయే స్థలాలు ఎక్కడ వస్తాయో క్షేత్రస్థాయిలో స్పష్టత ఏర్పడలేదు.... 

    ఇది అధికార పార్టీ మానస పుత్రిక ఆంధ్రజ్యోతి లో ఆర్క్ మార్క్ సంపాదకీయం . అధికార పార్టీకి  టీడీపీ కు  ఇప్పుడిప్పుడే  వాస్తవాలు అర్ధమవుతూన్నట్లు ఉంది...

    .  ఇల్లు కట్టుకోవాలన్నా ఏడాది రెండేళ్లు పడుతుంది... అలాంటిది రాజధాని నిర్మాణం అంటే ఆషామాషీ కాదన్న విషయాన్ని మనం కూడా అంగీకరించాలి...  

    అంటూ ఇప్పట్లో రాజధాని నిర్మాణం పూర్తి కాదన్న విషయన్ని చెప్పకనే చెప్పారు. అవును ఈ విషయం ప్రజలకు ఎప్పుడో అర్థమైంది . మూడున్నర ఏళ్ల కాలంలో రాజధాని నిర్మాణ డిజైన్ల ప్రక్రియ పూర్తి కాలేదు . వచ్చే ఏడాది ముందస్తు ఎన్నికలు. మరోసారి ప్రజలకు ఇవ్వటానికి కొన్ని పనులు మిగిలి ఉండాలి. నేను తిరిగి అధికారంలోకి వస్తేనే ప్రపంచ ప్రఖ్యాత రాజధాని ఏర్పాటు అవుతుందని , మరో పార్టీకి ఓటు వేస్తే రాజధాని రాదని చెప్పాలి .హైదరాబాద్ లేకపోతే తమ పరిస్థితి ఏమిటని కూడా ఆందోళన చెందుతున్నారు.  గత ఎన్నికలో  చంద్రబాబు ‘సమర్థ పాలకుడి’ అవతారం ఎత్తారు. హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశానని, నేను వస్తేనే సీమాంధ్రను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని ప్రచారం చేసారు . రాజధాని విషయంలో ప్రజల భ్రమలు తొలిగి పోతున్న క్రమం లో తిరిగి కొత్త రాగం ఆలపించటానికి ప్రజలను సంసిద్ధం చేయటానికి ఆంధ్రజ్యోతి ఆర్క్ కొత్త పలుకు పేరుతో సంపాదకీయం లో వ్రాసారు . 

    ఒక వైపు....  భవనాల డిజైన్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగడానికి కారణాలు ఉండవచ్చు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మించే అవకాశం తనకు లభించిందనీ, భవిష్యత్తు తరాలు కూడా తనను గుర్తుపెట్టుకునేలా రాజధాని నిర్మాణం చేపట్టాలనీ ఆయన కలలుగంటున్నారు. అలా కోరుకోవడంలో తప్పులేదు కూడా! అయితే రాజధాని నిర్మాణం ఎంతకూ మొదలుకాకపోవడంపై ప్రజల్లో అసహనం ఏర్పడుతోంది. .

    ... అంటూ  చంద్రబాబు గొప్ప లు కూడా ప్రజల్లో ఇంజక్ట్ చేసే ప్రయత్నం చేసారు . ఏది  ఏమైనా రాజధాని నిర్మాణం ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని స్పష్టం అవుతొంది . 

                                                                                                                   శ్రీహర్ష 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాజధాని నిర్మాణం ఇప్పట్లో తేలే వ్యవహారం కాదా ...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top