Translate

  • Latest News

    16, అక్టోబర్ 2017, సోమవారం

    ఈ ఏడాది దీపావళి వెలుగులు మసకబార నున్నాయా ?


      వెలుగులు  నింపే  దీపావళి  ఈ ఏడాది పలురకాల ప్రభావాలతో మసకబారి పోనుందా .. దేశం లో ఒకవైపు  కోర్టు తీర్పు,  దీపావళి బాణాసంచాపై జిఎస్‌టి ఎఫెక్ట్‌, మరో వైపు అల్పపీడనం తో వర్షాలతో ఈ ఏడాది దీపావళి వెలుగులు మాయం చేస్తున్నాయి . అన్నింటి కంటే   దీపావళి బాణాసంచాపైనా    జిఎస్‌టి ఎఫెక్ట్‌ పడింది. గతేడాది నోట్ల రద్దుతో కుదేలైన వ్యాపారులు ఈ ఏడాది జిఎస్‌టితో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వరకు బాణాసంచాపై 14.5 శాతంగా ఉన్న వ్యాట్‌ ఈఏడాది 18 శాతానికి ఎగబాకింది. వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం 2016 ఏప్రిల్‌ నుంచి 2017 మార్చి వరకు 13 జిల్లాల్లో కలిపి రూ.600 కోట్ల మేర వ్యాపారం జరగగా పన్నుల రూపంలో రూ.68.44 కోట్లు ఆ శాఖకు జమయ్యాయి.  దీపావళి సీజన్‌లో మాత్రమే బాణసంచా అమ్మకాలు మొత్తం వ్యాపారంలో మూడొంతుల వ్యాపారం జరుగుతోంది.
    బాణసంచాపై గతంలో అన్ని ట్యాక్స్‌లు కలిపి 14.5 శాతం ఉండగా ఇపుడు 18 శాతం జిఎస్‌టి చెల్లించాలి. వ్యాపారులు ఇంత పన్ను చెల్లించాలంటే బాణసంచా ధరలూ పెంచక తప్పదు.  గతేడాది 27 రకాల టపాసుల కలిగిన గిఫ్ట్‌బాక్స్‌ రూ.500కు వచ్చేది. 30 రకాలు రూ.650 నుంచి రూ.700కు విక్రయించేవారు. 35 రకాల బాక్స్‌ రూ.వెయ్యి పలికింది.  దీనికితోడు పండుగ సందర్భంగా రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌, వాణిజ్య పన్నుల శాఖకు ఉచితంగా టపాసుల బాక్సులను ఇవ్వాలి. బాణసంచాను ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి, చిత్తూరు జిల్లాలోని చిన్నమండ్యం, వెంకటగిరి, నెల్లూరు ప్రాంతాల నుంచి తెచ్చుకుని ఇక్కడ వ్యాపారం చేస్తారు. ఈ ఏడాది పన్ను 18 శాతం పెరగడంతో వ్యాపారం తగ్గుముఖం పట్టొచ్చొని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద దీపావళి ఇటు ప్రజల్లో కానీ అటు వ్యాపారుల్లో గాని అనందం నింపలేక పోతుంది

    - మానవేంద్ర


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఈ ఏడాది దీపావళి వెలుగులు మసకబార నున్నాయా ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top