తెలంగాణ టిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ లో అగ్గి రాజేస్తున్నాయి . ఇదేదో తెలంగాణ వ్యవహారమని అనుకుంటే తప్పే. ఏపి తెలుగుదేశం నేతలపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు సెగలు పుట్టిస్తున్నాయి. ఏపి ఆర్దిక మంత్రి,సీనియర్ టిడిపి నేత యనమల రామకృష్ణుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండువేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని,.కెసిఆర్ పై యనమల ఈగ వాలనివ్వరని రేవంత్ ఆరోపించారు. అంతేకాదు పయ్యావుల కేశవ్, పరిటాల శ్రీరాం కలిసి తెలంగాణలో బీర్ ఫ్యాక్టరీ పెట్టారని, కే.సి.ఆర్ దానికి అనుమతి ఇచ్చారని మరో ఆరోపణ. కేసీఆర్ ఏపిలో పరిటాల ఇంటికి పెళ్లికి వెళ్తే, తెలుగుదేశం నాయకులు అతి వినయంతో వంగి,వంగి మర్యాద చేశారని ఆయన అన్నారు.తమను కెసిఆర్ జైలులో పెడుతుంటే ఎపి టిడిపి నేతలు ఆయనకు వంగి , వంగి దండాలు పెట్టారని, మరి అంత అవసరమా అని కూడా ప్రశ్నించారు. ఇదే విమర్శలు ప్రతి పక్ష వైకాపా చేసిఉంటె ఇప్పటికి అనుకూల మీడియా లో పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు వెల్లువెత్తేవి . కానీ సొంత పార్టీకి చెందిన వాడు కావటంతో స్పందించడానికి ఎపి మంత్రులు వెనుకాడుతున్నారు. తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. రేవంత్ విషయం ప్రస్తావనకు వచ్చేసరికి ఆ విషయం అదిష్టానం చూసుకుంటుందని చెప్పి తప్పించుకున్నారు . ఇదే సమయం లో అధినేత చంద్రబాబు విదేశీ యాత్రలో ఉండటంతో ఏపీ టిడిపి నాయకుల పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుక చందంగా మారింది.
19, అక్టోబర్ 2017, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి