ఒకవైపు పెరిగి పోతున్న సాంకేతిక పరిజ్ఞానం తో ముందుకు పోతుంటే మరో వైపు మత ఛాందస ఆలోచనలు వెన్నక్కు లాగుతుంటాయి . ఈ దశలో ప్రముఖ ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ గురువారం భారతీయ ముస్లింలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడంపై నిషేధం విధిస్తూ కొత్త ఫత్వా విడుదల చేసింది. ముస్లింలలోని పురుషులు, మహిళలు సహా ఎవ్వరూ తమ ఫోటోలు గానీ, కుటుంబ సభ్యుల ఫోటోలుగానీ సోషల్ మీడియాలో పోస్టు చేయరాదని పేర్కొంది. భారతీయ ముస్లింలు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం ఇస్లాంకు విరుద్ధమని స్పష్టం చేసింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని షరణ్‌పూర్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న దారుల్ ఉలూమ్ సంస్థ.. దేశవ్యాప్తంగా ఇస్లామిక్ సెమినార్లు నిర్వహిస్తుంది. కాగా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం తప్పంటూ దారుల్ ఉలూమ్ జారీ చేసిన ఫత్వాను దారుల్ ఉలూమ్ దియోబంద్ చీఫ్ షహనవాజ్ ఖాద్రీ సమర్థించారు. ‘‘అవసరం లేకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడం తప్పు. దారుల్ ఉలూమ్ దియోబంద్ జారీ చేసిన ఫత్వా ముమ్మాటికీ సరైనదే..’’ అని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి