పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలో పరాదీప్ లో తీరం దాటేసింది. కానీ తెలంగాణ తె.దె.పా లో ఏర్పడిన రాజకీయ వాయుగండం మాత్రం ఇంకా తీరం దాటాకపోగా సునామీలు సృష్టిస్తోంది. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగొస్తే గాని అది తీరం దాటేటట్టు లేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒకరిద్దరు సీనియర్ నాయకులు మినహా మెజారిటీ నాయకులు రేవంత్ వైపే ఉన్నారు. వారంతా రేవంత్ ఎటంటే ఆటే దుమకడానికి రెడీగా ఉన్నారు. వారందిరిదీ ఒకే మాట. తెలంగాణలో తె.దె.పా పరిస్థితులు వేరు... ఆంధ్రా లో తె.దె.పా పరిస్థితులు వేరు... ఇక్కడ మేం మొదటినుంచి దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఇప్పడు ఆంధ్ర తె.దె.పా నాయకులు వచ్చి వారి స్వార్ధం కోసం ఇక్కడ కే.సి.ఆర్. తో కలిసి పనిచేయమంటే చేయడానికి మేము సిద్ధంగా లేము. ఈ విషయం డైరెక్టుగా మా అధినేత చంద్రబాబుతోనే తేల్చుకుంటాం. అంతేకానీ దొరలకు సలామ్ చేసేది లేదు అంటున్నారు.రేవంత్ తో పాటు దాదాపు 25 నేతలు వెళ్ళిపోతారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ తె.దే.పా దాదాపుగా ఖాళీ అయిపోతుంది. ఇదిలా ఉంటె రేవంత్ రాకను కాంగ్రెస్ లో సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఒక తుఫాన్, సునామి వచ్చినపుడు ఈ శక్తి ఆపలేదు. రేవంత్ అంతే. ఒక సునామి లాంటోడు.
21, అక్టోబర్ 2017, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి