Translate

  • Latest News

    17, డిసెంబర్ 2017, ఆదివారం

    స్వీప్ దశ నుంచి ఎడ్జ్ దాకా...

    మూడేళ్ల కిందటి వరకు గుజరాత్ లో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ   స్వీప్ చేసే పరిస్థితి.  ఆ దశ నుంచి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎడ్జ్ టు  బి.జె.పీ అని చెప్పుకునే స్థాయికి దిగజారింది. రేపు (18 డిసెంబర్) వెల్లడి కానున్న ఫలితాల్లో  బి.జె.పీ మెజార్టీ సీట్లు సాధించి విజయం సాధించవచ్చు గాక... కానీ స్వీప్ నుంచి ఎడ్జ్ కి వచ్చిందనే విషయం మరువరాదు. ఆఫ్ కోర్స్ 22 ఏళ్ళు అధికారం లో ఉన్న పార్టీ కి అసమ్మతి ఉండడం సహజం. ఆ అసమ్మతే అక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది. అయితే...
    బి.జె.పీ కి పెట్టని కోట లాంటి గుజరాత్ లో కాంగ్రెస్  బి.జె.పీ కి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదగడమే  ఆ పార్టీకి నైతిక విజయం. ఆఖరికి మోడీ ఎంతగా దిగజారారంటే మణిశంకర్ అయ్యర్ వ్యాఖలను వక్రీకరించి తనను నీచ కులమని తిట్టాడంటూ గుజరాత్ ప్రజలను రెచ్చ్హగొట్టాడు. ఎంతగా  భయపడ్డారంటే ప్రధాన మంత్రి స్థాయిలో ఉండీ నన్ను చంపడానికి మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ కు సుపారీ ఇచ్చారని చెప్పేవరకు.... పైగా మరోసారి గుజరాత్ లో హిందువులను రెచ్చగొట్టి లబ్ది పొందడానికి ప్రయత్నం చేసారు. నన్ను అవమానపరచడమంటే గుజరాత్ ప్రజలను అవమానించడమే అంటూ గుజరాత్ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ఎలాగయినా ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని చెయ్యని ప్రయత్నం లేదు. 
    ఈ ఎన్నికల్లో గెలవకపోయినా రాహుల్ గాంధీ కి వచ్చే నష్టం ఏమీ  ఉండదు. గుజరాత్ ఇచ్సిన  స్పూర్తితో వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మరింత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించవచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నే అధికారంలో ఉంది. మరోసారి అక్కడ అధికారం నిలబెట్టుకోగలగడం రాహుల్ ముందున్న కర్తవ్యం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: స్వీప్ దశ నుంచి ఎడ్జ్ దాకా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top