సినీ నటి నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన రోజా ఈ రెండు దశాబ్దాలలో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ సంపాదించుకుందే గాని పరిణితి గల రాజకీయవేత్త అని మేధావుల ప్రశంసలు పొందే స్థాయికి ఎదగలేదు. పైగా అడపా దడపా అనవసర వ్యాఖ్యాలు చేసి తాను నింద పడడంతో పాటు అటు తన పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుందనే అపప్రధ కూడా చాలా సార్లు మూటగట్టుకున్నారు. అయితే శుక్రవారం నాడు వైఎస్ ఆర్ సీపీ బృందం పోలవరం పర్యటన సందర్భంగా రోజా మీడియాతో పావుగంట సేపు అనర్గళంగా చెత్త విషయాలు కాకుండా సబ్జెక్టు మీద గణాంకాలతో సహా గుక్క తిప్పుకోకుండా చేతిలో ఎటువంటి పేపర్ సహాయం లేకుండా... ఎవరి ప్రాంపిటింగ్ లేకుండా మాట్లాడిన తీరు చూస్తే శహభాష్ రోజా అని ప్రశంసించకుండా ఉండలేం. జగన్ పై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ కి ఘాటైన సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఈసారి ప్రజల్లోకి వచ్చే ముందు రోజా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడితే సమంజసంగా ఉంటుంది. రోజా నంద్యాల ఎన్నికల సందర్భగా
చేసిన వ్యాఖ్యాలు పార్టీకి డామేజ్ చేశాయని, అధినేత ఆమెను తిట్టాడని, ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. అవి నిజం కూడా కావచ్చు. రోజా ఐరన్ లెగ్ అని ఎప్పటినుంచో ఒక నీలాపనింద కూడా ఆమెపై ఉంది. అయినా తనపై వచ్చిన విమర్శలన్నిటిని తట్టుకుని నిలబడి... పార్టీకి కట్టుబడి ఉండడమే కాకుండ తానేమిటో, పార్టీకి తన అవసరం ఎంత ఉందొ నిన్న తన ప్రతిభతోనే నిరూపించుకుంది. అందుకే శహభాష్ రోజా అని అనకుండా ఉండలేకపోతున్నాం.
-ఎడిటోరియల్ డెస్క్

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి