Translate

  • Latest News

    19, జనవరి 2018, శుక్రవారం

    సర్వే ఫలితాలతో టీడీపీ బీజేపీల స్నేహానికి బ్రేక్ ...



     రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే ఏ పార్టీకి  ఆ  పార్టీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో తమ పార్టీ తిరిగి అధికారం చేపట్టాలని కమలనాధులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిది....  గెలుపు అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయి..? అనే అంశాలపై బీజేపీ అనుకూల రిపబ్లిక్ టీవీ సీఓటర్లతో సర్వే చేయించాయి. తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న సర్వే ఫలితాలు అటుంచితే , రాష్ట్రంలో వైకాపాకు 13 ఎంపీ సీట్లు వస్తాయని తేలటం విశేషం. అటు  బీజేపీ , టీడీపీ లకు  వచ్చే  ఎంపీ స్థానాలు కేవలం 12 మాత్రమే. ఈ ఫలితాలు అధికార టీడీపీకి ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి.
     ఇప్పటికే బీజేపీతో కొనసాగుతున్న కలహాల కాపురంలో ఆజ్యం పోసినట్లు అవుతుంది. గత కొంతకాలంగా ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు కేంద్రం నుంచి రావల్సిన నిధులు రావటం లేదని, రాష్టంలో అభివృద్ధి కుంటుపడుతుందని టీడీపీ నేతలు ప్రచారానికి దిగారు. బీజేపీ నేతలు సైతం రాష్ట్ర ప్రభుత్వ విమర్శలకు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నిధులు పక్కదారిపడుతున్నాయని, కేంద్రం అందిస్తున్న నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలలో అవినీతి చేటుచేసుకుంటుందని ప్రతిదాడికి దిగుతున్నారు. ఎట్టకేలకు ఇటీవల ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబునాయుడుకు ఏడాదిన్నర తరువాత కలుసుకొనే అవకాశం లభించినా వారి మధ్య చర్చలు అనుకున్న విధంగా జరగలేదని తెలుస్తుంది. ఈ క్రమంలో సర్వే ఫలితాల ప్రభావం టీడీపీ, బీజేపీ పై పడే అవకాశం లేకపోలేదు. ఇదంతా గతం నుంచి ఊహిస్తున్నదే. కాని సర్వే ఫలితాలు బూచిగా చూపి బీజేపీ టీడీపీని ఎక్కువ సీట్లు  డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాని పక్షంలో తెగతెంపులకు పోయినా అశ్చర్యం లేదు. ఇదే జరిగితే ప్రతిపక్షవైకాపాకు నెత్తిమీద పాలు పోసినట్లే... 
    ఎడిటోరియల్ డస్క్

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సర్వే ఫలితాలతో టీడీపీ బీజేపీల స్నేహానికి బ్రేక్ ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top