ఎంతటి నేరం చేసినవాడినైనా పశ్చాత్తాపం పొందితే క్షమించడం మన సమాజ ఔన్నత్యం. నిజానికి గజల్ శ్రీనివాస్ గురించి మా భిన్నస్వరంలో ఒక సారి ఇచ్చాం కదా... చచ్చిన పామును మళ్ళీ ఎందుకు చావగొట్టడం అని అనుకున్నా కానీ... నిన్న ఆయన బెయిల్ పై విడుదల అవుతూ అన్న మాట మళ్ళి ఈ వ్యాసం రాయించింది. పశ్చాత్తాపం పొందనివాడు పశువుతో సమానం. బెయిల్ పై విడుదల అవుతూ గజల్ శ్రీనివాస్ నేను ఈ కేసు నుంచి నిర్దోషిగా బయట పడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంత జరిగాక... వీడియో లతో సహా పబ్లిక్ గా లీక్ అయ్యాక కూడా ఆయనలో కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా మాట్లాడడం ఎంతయినా గర్హనీయం. పైగా ఆయన మాటలను నిశితంగా పరిశీలిస్తే బయటకు వచ్చాక సాక్ష్యాలను తారుమారు చేసి కేసు నుంచి బయట పడగలననే ధీమా కనపడుతుంది. దేశ, విదేశాలలో ఆయనకు ఉన్నవిస్తృతమైన పరిచయాలతో అది అసాధ్యమైనదేమి కాదు. అదే జరిగితే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం మరింత సడలిపోతుంది. సో... గజల్ శ్రీనివాస్ కు అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చట్టం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.
25, జనవరి 2018, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి