ఈ దేశం ఎటు పోతోంది..? నాయకుల్లారా ఏం చేయదల్చుకున్నారు మా దేశాన్ని... మిమ్మల్ని నమ్మి రాష్ట్రాన్ని... దేశాన్ని మీ చేతుల్లో పెడితే... ఇక్కడేమో ప్రభుత్వ భూములు, రైతుల దగ్గర తీసుకున్న భూములన్ని ప్రైవేట్ పెద్దలకి, కార్పొరేట్లకి కట్టబెట్టేస్తున్నారు. ఆఖరికి ఆర్.ట్.సి స్థలాలు కూడా ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పేస్తున్నారు. అక్కడేమో రైల్వే స్టేషన్లను 45 ఏళ్ళకి, గట్టిగ అడిగితె 99 ఏళ్ళకి లీజ్ కి ఇచ్చేస్తున్నారు. అయ్యా... మిమ్మల్ని నమ్మి 5 ఏళ్ళు అధికారం కట్టబెడితే... ఆ 5 ఏళ్లలో మాక్సిమం ఎంత దోచుకోవాలో అంత దోచుకుందాం అన్న రీతిలో మీ పాలన నడుస్తోంది. మన రాజ్యంగంలో రీ కాల్ ఆప్షన్ ఉంటె ఎంత బాగుండేది... తరిమెల నాగిరెడ్డి ఏనాడో చెప్పారు... తాకట్టులో భారత దేశం... అని... టి. కృష్ణ సినిమా తీసాడు దేశంలో దొంగలు పడ్డారు.. అని.. వాళ్ళ మాటల్ని నేటి రాజకీయ నాయకులు నిజం చేస్తున్నారు. ఈ దేశాన్ని ఈ ఇంటి దొంగల నుంచి కాపాడేదెవరు... శ్రీ..శ్రీ అన్నట్టు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడవద్దు.. మనల్ని మనమే రక్షించుకోవాలి. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. అందుకు ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా సమాయత్తం కావాలి.
16, ఫిబ్రవరి 2018, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి