విడిపోయే కాలం ముందుంది
కుక్కను చంపాలంటే పిచ్చిదనే ముద్ర వేయాలన్నది జగమెరిగిన సత్యం . ఇందులో అంతర్లీనంగా ఒక సూత్రం దాగి ఉంది. మన అవసరాల కన్నా ప్రజల అవసరాలు ముఖ్యమని నమ్మిస్తే చాలు మిగతా పని ప్రజలు చూసుకుంటారు . మన చేతికి మట్టి అంటకుండా పని పూర్తి అవుతుంది. ఇలాంటి ఫార్ములాలు సీఎం చంద్రబాబు దగ్గర చాలా ఉన్నాయి. అపర చాణిక్యుడు గా పేరుగాంచిన చంద్రబాబుకు ఈ ఫార్ములా తెలియంది కాదు . ఇప్పటికే తన మీడియా ద్వారా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతుంటే కేంద్రం అడ్డు పడుతుందని ప్రజల మనస్సులో ఇంజెక్ట్ చేసారు. ఇదే కోవలో కేంద్ర బడ్జెట్ తెర మీదకు రావటంతో బీజేపీ పై దాడి తీవ్రమైంది. బడ్జెట్ ప్రసంగం పూర్తి కావటం ఆలస్యం టీడీపీ భజన మీడియా చర్చలు ,ప్రజలు ఆగ్రహం పేరిట కధనాలు వండి వార్చారు.
సరే ఇలా అని బీజేపీ ఏమైనా వెనుకంజ వేసిందా అంటే అదీ లేదు . కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. బూత్‌స్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేయండి. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వండి. రాష్ట్రానికి మోదీ సర్కారు చేస్తున్న సహాయం గురించి ప్రజలకు వివరించండి’’ అని అమిత్‌షా సూచించారు.
ఇప్పటికే బీజేపీతో కొనసాగుతున్న కలహాల కాపురంలో బడ్జెట్ ఆజ్యం పోసినట్టు అయింది గత కొంతకాలంగా ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు కేంద్రం నుంచి రావల్సిన నిధులు రావటం లేదని, రాష్టంలో అభివృద్ధి కుంటుపడుతుందని టీడీపీ నేతలు ప్రచారానికి దిగారు. బీజేపీ నేతలు సైతం రాష్ట్ర ప్రభుత్వ విమర్శలకు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నిధులు పక్కదారిపడుతున్నాయని, కేంద్రం అందిస్తున్న నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలలో అవినీతి చేటుచేసుకుంటుందని ప్రతిదాడికి దిగుతున్నారు. ఎట్టకేలకు ఇటీవల ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబునాయుడుకు ఏడాదిన్నర తరువాత కలుసుకొనే అవకాశం లభించినా వారి మధ్య చర్చలు అనుకున్న విధంగా జరగలేదు ఈ క్రమంలో బడ్జెట్ సాకుగా చూపి టీడీపీ మిత్రపక్షము తప్పు కొంటుందా .. లేదా మరో అవకాశం కోసం ఎదురు చూస్తోందా .. చూద్దాం ఏం జరుగుతుందో ...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి