మరోమారు ఏపీ ప్రజలు ఒక్కటై నిలిచి పోరాడే సమయం ఆసన్న మైంది . రాష్టానికి ప్రత్యేక హోదా పై రాష్ట్రం లో రాజకీయ పార్టీ లు ప్రజల మనోభావాలకు అనుగుణంగా స్పందిస్తున్నారు. ప్రతి పార్టీ ఈ అంశంపై స్పందించకపోతే మైలేజి యాడ తగ్గుతుందోనని తాము పోరాటానికి సిద్ధమని చెబుతున్నారు. మంచిదే . ఈ ప్రత్యేక హోదా అంశం అధికారంలో ఉన్న టీడీపీ కి ప్రాణాసంకటం గా మారింది .ఈ అంశంపై తెలుగుదేశం నేతలు తర్జన భర్జన పడుతున్నారు . కేంద్రంలో అధికారం పంచుకుంటూ కేంద్రంపై పోరాటం చేస్తున్నామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అయితే ప్రస్తుతం టీడీపీ సైతం ప్రత్యేక హోదా అంటూ గళం విప్పటం విశేషం . వైకాపా , వామ పక్ష లు ముందునుంచి ప్రత్యేక హోదా పై తమ స్టాండెడ్ లోనే ఉన్నాయి.
విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు కడుపు కొడితే.. ముక్కలయ్యాక కమలనాథులు ఏపీ ప్రజల నోట్లో మట్టికొట్టారు. విభజన వల్ల మాకు అన్యాయం జరుగుతుంది.. న్యాయం చేయండి మహాప్రభో అని మొత్తుకుంటే.. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగినవారికి ఖాకీ లాఠీదెబ్బ రుచిచూపించింది. ఆ తర్వాత ఆ పార్టీ ఇపుడు ప్రతిపక్షంలో కూర్చొంది. విభజన సమయంలో ఏపీ ప్రజలకు అండగా ఉంటామని తొడలు కొట్టిమరీ చెప్పిన కమలనాథులు ఇపుడు అధికారపీఠమెక్కి వెలిగిపోతున్నారు. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడా.. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో.. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారపక్షంలో కూర్చొన్నారు. కానీ, ప్రత్యేక హోదా మాత్రం అలానే ఉంది.
అప్పట్లో కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర విభజనకు కత్తులు నూరుతుంటే.. ఇది అన్యాయం.. ఏపీ ప్రజలకు ఐదేళ్ళు కాదు.. పదేళ్లు ప్రత్యేక ఇవ్వాల్సిందేనంటూ కమలనాథులు గగ్గోలు పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక.. కాంగ్రెస్ సానబెట్టిన కత్తులతో ఇపుడు ఏపీ ప్రజల పీకలు తెగ్గోస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకు తాము అండగా ఉంటామని అభయ హస్తం ఇచ్చిన కమలనాథులు.. ఇపుడు అధికారంలోకి వచ్చాక ఏపీకి హ్యాండిచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో నాటి హామీ మేరకు ప్రత్యేక హోదా కోసం పోరాడే హక్కు, నిలదీసే హక్కు ప్రజలపై ఉంది . రాజకీయాలకు ఏపీ ప్రజలు బలిపశువులు కాకుండా ఒక్క తాటిపై నిలిచి పోరాడాల్సిన తరుణం ఆసన్నమైంది
ఎడిటోరియల్ డస్క్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి