చంద్రబాబుకు పైత్యం పతాక స్థాయికి చేరింది... అందుకే ఈ మధ్య వెర్రి పోకడలు పోతున్నారు. ఈ దేశ పౌరుడు ఎవరైనా ఈ దేశ రాజ్యంగంకు కట్టుబడి ఉండాలి. మనది ఫెడరల్ రాజ్యంగం. రాష్ట్రాలు అన్ని అంతిమంగా కేంద్రానికి కట్టుబడి ఉండాలి. అలా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు. తమకు ఈ దేశంతో సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడడం... తమకు ప్రపంచ దేశాల తోనే పోటీ అనడం సరి కాదు. ప్రతి రాష్ట్రం కేంద్రాన్ని బైపాస్ చేసి నేరుగా విదేశాలతో సంబంధాలు పెట్టుకోవడం మొదలెడితే అది అంతిమంగా ఈ దేశ సార్వభౌమత్యానికే సవాల్ గా పరిణమించే ప్రమాదం ఉంది. మనకు కేంద్రంలో మాత్రమే విదేశాంగ శాఖ ఉంటుంది. రాష్ట్రాలకు విదేశాంగ శాఖ ఉండదు. విదేశాలకు సంబంధించి ఏ వ్యవహారం నడపాలన్న విదేశాంగ శాఖ ద్వారానే జరగాలి. కానీ గత రెండు దశాబ్దాలుగా దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని బైపాస్ చేసి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం లో ఉన్న పాలకులు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసమో... మరే కారణం చేతనో కానీ... ఈ విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించడం చేత \రాష్ట్రాలు కొన్ని నేరుగా తమ రాష్ట్రాలకు ప్రపంచ దేశాల అధిపతులను, పారిశ్రామిక వేత్తలను తీసుకు రావడం, వారితో నేరుగా సంబంధాలు పెట్టుకోవడం జరుగుతోంది. గతంలో మన చంద్రబాబు బిల్ గేట్స్ ను, క్లిమ్ టన్ ను ఆ విధంగానే తీసుకువచ్చారు. ప్రస్తుతం వైజాగ్ లో ప్రతి ఏడాది సి.ఐ.ఐ సదస్సులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో అమరావతి లో దావోస్ తరహాలో ప్రపంచ స్థాయి ఆర్ధిక సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. వైజాగ్ లో సి.ఐ.ఐ సదస్సులో ఆదివారం మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈడీబీ) ర్యాంకుల్లో ఇండియా(100) కంటే ఆంధ్రప్రదేశ్ (88) మెరుగ్గా ఉందని, తమకు ప్రపంచ దేశాలతోనే పోటీ అని వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్యలు మన ఫెడరల్ భావనకు విరుద్ధమైనవి. మన దేశ సార్వభౌమత్యాన్ని సవాల్ చేసేవి. అయినా కేంద్రంలో ఉన్న నేతలు కిమ్మనకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఇది ఒక సామాన్యుడి ప్రశ్న. దీనికి ఘనత వహించిన నేతలు సమాధానం చెప్పాలి.
-మానవేంద్ర
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి