పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన హామీలే హాట్ టాపిక్ అయ్యాయి. కేంద్రం మాత్రం ఏపీ విభజన హామీలను నెరవేర్చే ఉద్దేశంలో లేదు మిత్రపక్షమై ఉండి కూడా కేంద్రం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో గత కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించినప్పటికీ రాష్ట్రప్రయోజనాల కోసమే వెనక్కితగ్గామని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పరిణామాలన్నింటినీ చూస్తే మరోసారి కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని టీడీపీ పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
నిజానికి పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనపై చర్చ జరిగినప్పుడు అప్పట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయుకుడుగా ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను వెనకేసుకొస్తూ గట్టిగా పోరాడారు. అయినా బడ్జెట్‌లో ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం చూస్తే ఇక ఎన్‌డీఏ ప్రభుత్వంలో రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా ఏర్పడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తావన కూడా బడ్జెట్‌లో ఎక్కడా కనిపించకపోవడం తెలుగు ప్రజలను, రాజకీయ పక్షాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనే అనుమానంతో మోదీ ముఖ్యమంత్రికి పగ్గాలు వేసే ఆలోచన చేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు కొందరు భావిస్తున్నారు.ఇటీవలి ఎన్నికల ఫలితాలను బట్టి మోదీ ప్రభావం క్రమంగా క్షీణిస్తోందని అర్థవుమతోంది. అయితే, కాంగ్రెస్ నాయకత్వం ఈ పరిస్థితిని ఆశించిన స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతోంది. దరిమిలా దేశ రాజకీయాల్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ కూటమి ఏర్పాటులో చంద్రబాబు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉందనే మోదీ టీడీపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి