నిన్నటి దాకా కలసి తిరిగిన బి.జె.పీ, తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఒకరి కాళ్ళ కింద ఒకరు గోతులు తవ్వుకుంటున్నారు. నువ్వు దొంగ అంటే... నువ్వు దొంగ అంటున్నారు. బి.జె.పీ వాళ్ళు చంద్రబాబు కొడుకు లోకేష్ అవినీతిపరుడు అంటే .... ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అమిత్ షా కొడుకు అవినీతిని బయటపెడతామంటున్నారు. మోడీ కి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ గొడవల్లో మోడీ కొడుకు పేరు కూడా బయటకు లాగేవారు. ఇదంతా చూస్తుంటే.. చిన్నప్పుడు ప్రజానాట్య మండలి వారి సుద్దులు పాట గుర్తుకువస్తోంది. వారి జాతకాలు వీరి కెరుక... వీరి జాతకాలు వారి కెరుక... వాళ్ళు...వీళ్ళు అందరి జాతకాలు ప్రజలకు ఎరుక అని... డప్పు కొట్టి పాడుతూ ఉంటే హాలు చప్పట్లతో దద్దరిల్లిపోయేది. వీళ్ళ గొడవంతా పంపకాల్లో వచ్చిన తేడాయే అని ప్రజలకు అర్ధమవుతూనే ఉంది. అది పోలవరం కమిషన్లలోనా.. ఎం.పీ. ఎం.ఎల్.ఏ సీట్ల పంపకాల్లోనా.. లేదా అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 కు పెంచమని అడిగితే పెంచనందుకా...ఏదయితేనేమి... మొత్తానికి పంపకాల్లో తేడాలతోనే వ్యవహారం బెడిసికొట్టిందనేది ప్రజలకు అర్ధమైనది. అందుకే చంద్రబాబు అర్జంటుగా ప్లేట్ ఫిరాయించి హోదా నినాదం తలకెత్తుకున్నారు. జనాలు ఏమనుకుంటారనే సిగ్గు, భయం ఆయనకు లేదు. ఎందుకంటే తాను పంది అంటే.. పంది... నంది అంటే నంది అని రాసే మీడియా చేతుల్లో ఉందనే అహంకారం. ఇలా అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించడం బాబుకు కొత్తేమి కాదు. 1983 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో మంత్రిగా ఉంది అధిష్టానం ఆదేశిస్తే మామపై పోటీ చేస్తా అని సవాల్ చేసిన చంద్రబాబు 1983 ఎన్నికల్లో తెలుగుదేశం గెలవగానే ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించి మామ పంచన చేరి... ఆ తర్వాత పుష్కర కాలానికి ఏకంగా మామను కుర్చీలో నుంచి లాగి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న సంగతి అందరికి తెలిసిందే. అధికారం కోసం దేనికయినా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు. మళ్ళి అధికారం లోకి రావడానికి కొత్త పొత్తులతో... అవసరమైతే కాంగ్రెస్ తో జత కట్టడానికయినా వెనుకాడడు. దానికి ఓ కధ అల్లుతాడు. మతవాద బి.జె.పీని ఓడించడానికి కాంగ్రెస్ తో కలవాల్సి వచ్చిందని చెప్పి ముస్లిం ఓట్లకు గాలం వేస్తాడు. సో... చూద్దాం.. ముందు... ముందు బి.జె.పీ, తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఎవరెవరి జాతకాలు... ఏమేమి బయట పెడతారో...
26, మార్చి 2018, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి