ఓ పక్క గుడిసె తగలబడిపోతోంది. ఫైరింజన్ కు ఫోన్ చేసి వారు వచ్చి పైపులు అన్ని సిద్ధం చేసుకుని మంటలు ఆర్పేదాకా ఆగితే ఈ లోపు ఆ చిన్ని గుడిసె కాస్తా పూర్తిగా భస్మీపటలం అయిపోతుంది. అందుకే చుట్టూ పక్కల ఉన్న వారంతా తమ ఇళ్లలో వారి వారి అవసరాల కోసం డ్రమ్ముల్లో...బిందెల్లో దాచి పెట్టుకున్న కాస్త నీళ్లు తెచ్చి ముందు ఆ మంటలు ఆరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదని తామూ ఓ చెయ్యి వేసి మంటలు ఆర్పుతున్నట్టుగా నటిస్తున్నారు. పై;పైన హడావుడి చేస్తున్నారు. అయితే అక్కడ ఓ మనిషి మాత్రం చేతులు కట్టుకుని నిలబడి ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేసాను.. వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చి మంటలు ఆర్పుతారు... మీరెందుకు కంగారు పడతారు అన్నట్టుగా గమ్మున నిలుచున్నాడు.
అక్కడ తగలబడి పోతోంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నది ప్రతిపక్షాలైన వై.సి.పీ, వామపక్షాలు. ఆర్పుతున్నట్టు నటిస్తున్నది తెలుగుదేశం. మరి ఆ మనిషి ఎవరో నేను చెప్పాలా... ఇంకా మీకు వెలగలేదా.. అదేనండి ప్రశ్నించే మనిషి... పాపం ఆయన లెక్కలు ఇంకా తేలలేదేమో... లేదా బాబు గారి దగ్గర నించి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదేమో... హోదాపై ఆయన గోచి ఎప్పుడు బిగిస్తారో అని రాష్ట్ర ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈయన గారు హోదా కావాలంటారు కానీ.. యుద్ధం చేద్దాం రమ్మంటే... కత్తి ...డాలు ఇంకా వెతుకకుంటూనే ఉన్నారు. ... ఈ నెల 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుపుతానంటున్నారుగా... ఆ సభలో అయినా హోదాపై ఆయన కార్యాచరణ స్పష్టంగా ప్రకటిస్తారేమో చూద్దాం...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి