మర్మస్థానం కాదది జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం... 30 ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన ప్రతిఘటన సినిమాలో వేటూరి రాసిన పాట. సినిమాలో లెక్చరర్ విజయశాంతి ని విద్యార్థులు అసభ్యంగా బ్లాక్ బోర్డు మీద బొమ్మ గీసి హేళన చేసినప్పుడు.. విజయశాంతి స్టూడెంట్స్ కళ్ళు తెరిపించేలా పాడే పాటకు వేటూరి రాసిన అద్భుతమైన సాహిత్యం ఇది. అప్పటికింకా సెల్ ఫోన్లు రాలేదు.. యువత చెడిపోవడానికి ఇప్పుడున్నంత విస్తృత అవకాశాలు లేవు. ఏదో కొద్దీ శాతం మంది యువత మాత్రం దొంగ చాటుగా బడ్డీ లలో దొరికే సెక్స్ సాహిత్యం చదవడం, కొన్ని సినిమా హాళ్లలో మధ్యలో వేసే బి.ఎఫ్ బిట్లు చూడడం మాత్రమే.. అప్పట్లోనే పెడ మార్గం పడుతున్న యువతను సరిదిద్దడానికి ఇటువంటి పాట ఒకటి అవసరమైనది. వేటూరి అంత సూటిగా...ఘాటుగా చెప్పేసరికి సమాజం ఒక్క సారి ఆలోచనలో పడింది... మరి ఇప్పుడు అరచేతిలో సెల్ ఫోన్. నెట్ ఓపెన్ చేస్తే వేల సంఖ్యలో బూతు చిత్రాలు... అవి చూసి మూతి మీద మీసం రాని టీనేజ్ పిల్లవాడు కూడా రేపులు చేసేస్తున్నాడు.
మొన్న గుంటూరు జిల్లా కారంపూడి పక్కన ఒప్పిచర్ల లో అదే జరిగింది. భర్త వదిలేస్తే ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను పక్క ఇంట్లో ఉంటున్న 17 ఏళ్ల కుర్రోడు...మానవ మృగంలా మీద పడి రేప్ చేయడమే కాక ఆమె జననాంగంలో కర్ర దోపి అత్యంత పాశవికంగా ఆమెను హింసించాడు. ఆమె ఇప్పుడు గుంటూరు జి.జి.హెచ్ లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎక్కడో ఢిల్లీలో కాదు... మన పక్కనే.. అది.. పక్క పల్లెటూరిలో జరిగింది. 17 ఏళ్ల పిల్లగాడు ఇలా మృగంలా మారడానికి కచ్చితంగా సెల్ ఫోన్లే కారణం. వేటూరి గారే అన్నట్టు శిశువులుగా పుట్టి మీరు పశువులుగా మారితే... మానవ రూపంలోనే దానవులుగా పెరిగితే... ఏమైపోతుంది... సభ్య సమాజం... ఏమైపోతుంది... మన భారత దేశం,...
మరిప్పుడు ఈ సమాజంలో కాస్తంతయినా ఆలోచన రేకెత్తించాలంటే, మార్పు రావాలంటే ఎంతమంది వేటూరి లు.. ఎన్ని ప్రతిఘటన లో లాంటి పాటలు రాయాలో... ఒరేయ్... స్త్రీ జననాంగాన్ని మర్మస్థానంగా... బలిసిన నీ కొవ్వు కరిగించుకోవడానికి ఉపయోగపడే ఆట వస్తువుగా చూడద్దురా... అది సృష్టికి ప్రతిసృష్టి చేసే.... నీకు... రేపు నీ బిడ్డలకు ... అలా తరతరాలకు జన్మనిచ్చే పుణ్యక్షేత్రం రా... అని జ్ఞానోదయం చెయ్యాల్సిన అవసరం ఉంది. సమాజంలో మేధావులు చాలా సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన తక్షణ సమస్య ఇది... మేధావుల్లారా... ఒక్కసారి ఆలోచించండి...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి