చంద్రబాబుకు కోపం వచ్చింది. తాను ఒక్కడే కష్టపడుతుంటే మిగిలిన మంత్రలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపం ఆయన కోపంలో అర్ధముంది. ఈ మద్యకాలంలో ఎన్నడు లేని విధంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగిపోయింది. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలో రెండు , మూడు గ్రూపులగా మారిపోయి అంతర్గత కలహాలతో కాలక్షేపం చేస్తున్నారు. ముందు నుంచి టిడిపి క్షమ శిక్షణ ఎక్కువ. నాడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎవరిమీదనైనా పార్టీ కట్టుబాటు తప్పితే వేటు వేసేవారు. ఇందుకు చంద్రబాబు అతీతుడుకాదు. సరే ఏదో రకంగా ఎన్‌టిఆర్ నుంచి పార్టీ పగ్గాలు చేత పట్టిన తరువాత కూడా చంద్రబాబు ఇదే విధంగా క్రమశిక్షణ తప్పేవారిపై కఠినంగా వ్యవహరించేవారు.
బాబు స్వయంకృతాపరాధం...
ఇదంతా గతం పార్టీ పరువు ఎప్పడో గంగలో కలిసిపోయింది. ఇందుకు వేరేవ్యక్తలను నిందించాల్సిన అవసరం లేదు. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధం .విపక్ష ఎమ్మెల్యేలను ఎప్పడైతే టిడిపిలో చేర్చుకున్నారో... వారికి మంత్రి పదువులు ఇచ్చి కీలక పదవులు కట్టబెట్టారో అదో రోజు టిడిపి పతనం ప్రారంభమైంది. ఒక్కొక్క నియోజకవర్గంలో పార్టీని ఓడించిన వైసీసీ ఎమ్మెల్యేలు మంత్రులుగా , పార్టీ నాయకులుగా చెలామణి అవుతున్నారు. ఓడిపోయినవారు ఇప్పటివరకు నాయకులుగా ,పార్టీ ఇన్‌చార్జులుగా వ్యవహరించేవారు. కాని వైసీసీ వారిని పార్టీలో చేర్చుకోవటంతో పరిస్థితి మారిపోయింది. దీంతో గతం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారు ఒక గ్రూప్‌గా, వైసీసీ నుంచి వచ్చిన వారు మరో గ్రూప్‌గా మారిపోయారు. కొన్ని చోట్ల టిడిపిలోనే ఎంపీ వర్గం అంటూ మరో గ్రూప్‌లు తయారయ్యాయి. నాటి గొట్టిపాటి ,కరణం బలరామ్ కాని, ప్రస్తుత ఆళ్లగడ్డలో అఖిల ప్రియ,సుబ్బారెడ్డి, ఉత్తరాంద్రలో మంత్రి గంటా, అయ్యనపాత్రుడుల మద్య వార్ గాని ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరికొన్ని చోట్ల చినబాబే ఒక వర్గానికి కొమ్మగాయటంతో టిడిపిలో ముసలం బయలుదేరింది. ఇదంతా ఒక ఎత్తైత్తే చంద్రగిరి నియోజకవర్గంలో చినబాబు దెబ్బకు గల్లా అరుణకుమారి పార్టీ నుంచి శాశ్వితం నిష్ర్కమించారు.
బాబు అస్త్రాలు బయటకు తీస్తారట...
చంద్రబాబు కు మొదటి నుంచి పార్టీ క్యాడర్, మంత్రులను చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి తాపత్రయపడతారు. ఇందులో భాగంగానే ఎప్పటికప్పడు వారికి సంబంధించిన నివేదకలు సర్వేలు చేయించి తన దగ్గరపెట్టుకుంటారు. ఎవరైనా తోక జాడిస్తే వారిని సర్వే రిపోర్ట్ బూచిగా చూపి అణగదొక్కుతారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాబు గారు మరోసారి తన అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీలో అందరివ్యవహారం తెలుసునని నర్మగర్బంగా వ్యాఖ్యానించటం బాబు ఎత్తుగడలో భాగమే. కాని బాబు అస్త్రాలు పనిచేస్తాయా... ? తమ్ముళ్లు గాడిలో పడతారా ...అన్నది వేచిచూద్దాం...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి