బి.జె.పీ ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతంగా అమలుచేసిన కుల రాజకీయ ప్రణాళికనే ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ఇక్కడ ఇప్పటిదాకా రాజ్యాధికారం అందని ద్రాక్షగా ఉన్న కాపు కులానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. జనసేన ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా కాపు కులంలో యువకులు తప్ప పెద్దవారు పెద్దగా పవన్ కళ్యాణ్ ను విశ్వసించడంలేదు. అందుకే కాపు పెద్దలైన ముద్రగడ, కన్నా లాంటి వారిని మచ్చిక చేసుకుని ఆ కులం ఓట్లు పొందడానికి బి.జె.పీ వ్యూహం రూపొందించింది. ఇక బి.జె.పీ తన తురుపుముక్కగా ఐ.పీ.ఎస్ ఆఫీసర్ వి.వి.లక్ష్మీనారాయణను ప్రయోగించనుంది. జగన్, పవన్ ఇమేజ్ లకు ప్రత్యామ్నాయంగా రాయలసీమ లోని కర్నూలు జిల్లా శ్రీశైలం కు చెందిన ఐ.పీ.ఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను బి.జె.పీ రంగం లోకి దించుతోంది. అవినీతిపై పోరాటానికి ప్రతీకగా బి.జె.పీ ఈయన్ను ప్రజల ముందు ఉంచి అవినీతి రహిత, సమర్ధ పాలనను అందిస్తామని చెప్పనుంది. లక్ష్మీనారాయణ మన రాష్ట్రానికి చెందిన వాడైనా మహారాష్ట్ర బేస్ 1990 బ్యాచ్ ఐ.పీ.ఎస్ ఆఫీసర్. అందువల్ల ఈయనపై హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉంది. లక్ష్మీనారాయణ ఖాకీ నిక్కర్ వేసుకుని ఆర్.ఎస్.ఎస్ పరేడ్ లో పాల్గొన్న ఫోటోలు కూడా ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. లక్ష్మీనారాయణ ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం తన రాజకీయ రంగ ప్రవేశానికి ముందు తొలిగా గుంటూరు జిల్లా పర్యటన చేసి రైతులతో ముఖాముఖీ కలిశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. మరో పక్క మరో రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్, మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు ద్వారా బ్రాహ్మణ వర్గాన్ని. ఐ.ఏ.ఎస్ లను, ఉద్యోగ వర్గాలకు దగ్గర కావడానికి ప్రణాళిక రచిస్తోంది. ఎలాగూ రామ్ మాధవ్, జి.వి.ఎల్ నరసింహారావు లాంటి వ్యూహకర్తలు ఉండనే ఉన్నారు. సో... వచ్చే ఎన్నికల్లో బి.జె.పీ ఇద్దరు లక్ష్మీనారాయణులతో ఆంధ్రప్రదేశ్ లో రంగంలోకి దిగనుంది.
31, మే 2018, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి