Translate

  • Latest News

    2, జూన్ 2018, శనివారం

    పెంచలయ్య లను, ప్రభాకర్ లను పెంచి పోషిస్తున్న చంద్రబాబు


    దెందులూరు ఎం.ఎల్.ఏ చింతమనేని ప్రభాకర్, దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ పెంచలయ్య లాంటి  వాళ్ళను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు చేరదీసి, పెంచి, ప్రోత్సహిస్తున్నంత కాలం రాష్ట్రంలో బడుగులపై, మహిళలపై ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి. రౌతును బట్టే గుర్రం అన్న సామెత లాగానే తెలుగుదేశం పార్టీ అధినేతకు బి.సి, ఎస్సి, ఎస్.టీ, మైనార్టీ లంటే చిన్న చూపు ఉన్నట్టు పలు సందర్భాల్లో బయటపడ్డారు. అధినేత మనస్త్వత్వం ఎలాంటిదో... ఆ పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ల మనస్త్వత్వం కూడా అలాంటిదే... పైగా దాడులు చేసినా ఏమి అనకుండా... బాధితులనే బెదిరించి... తమకు అండగా ఉంటున్నాడు... ఇంతకంటే మంచి నాయకుడు ఎక్కడ దొరుకుతాడు... నాయకులు, కార్యకర్తలు తప్పులు చేసినా... వారిని వెనకేసుకొచ్చే అధినాయకుడు ఉంటే... ఇక అంతకంటే ఏం కావాలి.... అలాంటి లీడర్ ఉంటె ఎవరైనా రెచ్చిపోరూ.... అందుకే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు... అది వాళ్ళ తప్పు ఎంతమాత్రం కాదు... దెందులూరు ఎం.ఎల్.ఏ చింతమనేని ప్రభాకర్ అందుకే గదా రెచ్చిపోతోంది... 
    మన పెంచలయ్య చూడండి... తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒకప్పుడు రౌడీషీట్ ఉండేది. సీతానగరం సెటిల్మెంట్ గాంగ్ తో దోస్తీ ఉండేది. 2004 లో కృష్ణా పుష్కరాల్లో దొంగలను ప్రోత్సహిస్తున్నాడని అప్పటి సి.ఐ కోటేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్ దాకా కొట్టుకుంటూ తీసుకువెళ్లాడు. అయితేనేం... 2014 లో బాబు గారు గెలవగానే మన పెంచలయ్యను తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ను చేసి పారేసాడు... కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మనోడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాడేపల్లి జేబుదొంగలతో సెటిల్మెంట్ చేసుకున్నాడు.  ఒక్కొక్కరు నెలకు 50 వేలు మామూళ్లు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నాడు... ఇంకేముంది... మూడేళ్ళలో లక్షలు..కోట్లు వచ్చి పడ్డాయి... ఆ దొంగ సొమ్ము లో కాస్త మన లోకేష్ గారికి మామూళ్లు ఇచ్చాడు.. అంతే ... మనోడిని ఏకంగా దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ ని చేసేసారు ... ఇంకేం కావాలి... మరి పెంచలయ్య రెచ్చిపోకుండా  గమ్మునుంటాడా... అది ఒకప్పుడు తనపై పోలీసోళ్ళకు కంప్లైన్ట్ ఇచ్చిన క్షురకుల మీద కక్ష తీర్చుకోకుండా ఉంటాడా... ఆబ్బె... పెంచలయ్యది తప్పు కానే కాదు... మరెవరిది తప్పు... చంద్రబాబుదా... లోకేష్ బాబుదా... లేదా ఇలాంటి పార్టీని, నాయకులను గెలిపించిన ప్రజలదా.. నేను చెప్పలేను సారూ... మీరే నిర్ణయించుకోండి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పెంచలయ్య లను, ప్రభాకర్ లను పెంచి పోషిస్తున్న చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top