వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రీ పోల్ అలయెన్స్ కంటే పోస్ట్ పోల్ అలయెన్స్కే రాజకేయ పార్టీలు మొగ్గు చూపనున్నాయి. ఈ సారి ఎవరికీ వారే తాము అన్ని సీట్లకు పోటీ చేస్తామని చెబుతున్నారు. అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న బి.జె.పీ, జనసేనలు ఈ సారి దూరం అయ్యాయి కాబట్టి... తెలుగుదేశం ఎలాగు ఒంటరిదయింది కాబట్టి ఆ పార్టీ 175స్థానాలకు పోటీ చేస్తుంది. ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరితోనూ పొత్తులు కలిసే అవకాశం ప్రస్తుతానికి కనపడడం లేదు కాబట్టి ఆ పార్టీ కూడా 175 స్థానాలకు పోటీ చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పీ కూడా రాష్ర్ట్రంలో బలం లేకపోయినప్పటికీ... ఈ సారి రాష్ట్రంలో 175 స్థానాలకు పోటీ చేసి రాష్ట్రంలో తన స్వంత బలం ఎంత ఉందో పరీక్షించుకోవాలనుకుంటోంది. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా జన సేన రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు. మరి జన సేన తో పొత్తు పెట్టుకోవాలని ఆరాటపడుతున్న కమ్యూనిస్టుల పరిస్థితి ఏమిటో... వారు ఈ సారి ఎవరితో పొత్తు పెట్టుకుంటారో... ఇక కాంగ్రెస్ పార్టీ ఇటీవల కర్ణాటక పరిణామాల అనంతరం తెలుగుదేశం పార్టీకి దగ్గరైనట్టు కనపడుతున్నా... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోకపోవచ్చు. పైకి ఎవరికీ వారు విడివిడిగా పోటీ చేసినా... అంతర్లీనంగా రహస్య పొత్తులు ఉంటాయనేది మాత్రం ఖాయం. అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ప్రీ పోల్ అలయెన్స్ కంటే పోస్ట్ పోల్ అలయెన్స్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది. . ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలే వీరికి ఆదర్శం. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక అప్పటి పరిస్థితులను బట్టి ఆయా పార్టీలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఎన్నికల్లో ఎవరికీ వారే పోటీ చేసే.. ఆ తర్వాత చూసుకుందాం అన్న ధోరణి లో ఉన్నాయి. చూద్దాం.. మరి...
3, జూన్ 2018, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి