Translate

  • Latest News

    23, జూన్ 2018, శనివారం

    గణపతి సచ్చిదానంద స్వామిజీ ని పావులా వాడేసుకున్నారు...


    మైసూర్ కేంద్రంగా గత ఐదు  దశాబ్దాలుగా  ప్రపంచమంతటా తన భక్తులను విస్తరించుకున్న గణపతి సచ్చిదానంద స్వామిజీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా  మారాడు. పూర్వాశ్రమంలో సత్యన్నారాయణ అయిన గణపతి సచ్చిదానంద స్వామిజీ తన తల్లి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక సంపదను వారసత్వంగా తీసుకుని ఆ బాటలో పయనించి అవధూత గణపతి సచ్చిదానంద స్వామిజీ గా మారారు. మిగతా స్వామీజీల కంటే కొంచెం భిన్నంగా వివాదాలకు కాస్త దూరంగా ఉండే ఈయన సంగీతంతో రోగాలు తగ్గిస్తానంటూ ఓ సరికొత్త విధానాన్ని తన భక్తులకు పరిచయం చేశారు. ఈయన ఎంచక్కా పాడతారు కూడా. అయితే అవధూత లు అంటే సహజంగా ఇహ లోక సౌఖ్యాలకు దూరంగా ఉంటారు. కానీ ఈయన పేరులోనే తప్ప ఆచరణలో అన్నీ మిగతా స్వామీజీల లాగానే ఆడంబరంగానే  ఉంటారు. ఈయన భక్తుల జాబితాలో కోటీశ్వరులు ఉన్నారు. ఆ కోవలో వ్యక్తే లింగమనేని ఎస్టేట్స్ అధినేత లింగమనేని రమేష్. నూతన రాజధాని కేంద్రంలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రైన్ ట్రీ పార్క్ బిల్డర్ ఈయనే. అంతేకాదు. ఉండవల్లి లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండే గెస్ట్ హౌస్ ఈయనదే.  ఈయన  రైన్ ట్రీ పార్క్ లో జాతీయ రహదారి మీద దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించాడు. ఆ ఆలయం ప్రారంభోత్సవానికి  గణపతి సచ్చిదానంద స్వామిజీ ని పిలిచారు. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిలిచారు. ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. అంతా ఒక పధకం ప్రకారమే జరిగింది. పవన్ చంద్రబాబు, లోకేష్ లపై చేసిన విమర్శలతో డిఫెన్స్ లో పడ్డ చంద్రబాబును కొద్దిగా ఒడ్డున పడవేయడానికి లింగమనేని రమేష్ గణపతి స్వామిజీ ని పావుగా వాడుకున్నారు. చంద్రబాబు, పవన్ భేటీ జరిగినట్టుగా మీడియా కు లీకులు ఇచ్చి ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్నట్టుగా భ్రమింపచేసి. చంద్రబాబు దేనికయినా సమర్థుడని, పవన్ ను  మానేజ్ చేసాడన్నట్టుగా ప్రజలను నమ్మిచడానికి ఈ ఆలయ ప్రారంభోత్సవాన్ని ఇలా వాడేసుకున్నారు. ఈ మొత్తం తతంగంలో పాపం... గణపతి సచ్చిదానంద స్వామిజీని కూడా  ఓ పావు లా వాడేసుకున్నారండోయి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గణపతి సచ్చిదానంద స్వామిజీ ని పావులా వాడేసుకున్నారు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top