సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సోమాలియా అవన్నీ మిలటరీ ప్రభుత్వాలు. అక్కడ మానవ హక్కుల గురించి అడగడానికి అవకాశమే లేదు. కానీ మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ అది కాగితాల్లోనే... ఆచరణలో ఆ మిలిటరీ ప్రభుత్వాలే మన కన్నా నయం. నేతి బీరకాయ ప్రజాస్వామ్యం మనది... జింక చర్మం కప్పుకున్న పులులు మన పరిపాలకులు... థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సంస్థ సర్వే పచ్చి వాస్తవాలను వెల్లడించింది. మహిళల అభద్రత లో ప్రపంచంలోనే భారత దేశం ఫస్ట్ ర్యాంక్ అట. స్త్రీ శక్తి స్వరూపిణి అంటూ... మహిళలను దేవతలుగా పూజించే మన దేశంలో... మాతృదేవోభవ... అంటూ శ్లోకాలు వల్లించే మన దేశం మహిళలకు అసలు ఏ మాత్రం భద్రత లేని దేశాలలో మొట్టమొదటిదట.. షభాష్... నిన్న గాక మొన్న అమెరికా లో తెలుగు హీరోయిన్ల వ్యభిచారం గుట్టు రట్టు తో అమెరికాలో తెలుగు వారి పరువు నైలు నదిలో కలిసిపోయింది. ఇప్పుడు థామ్సన్ రాయిటర్స్ సర్వే తో మన దేశం పరువు కూడా గోవిందా... ఇంకా మీరెన్ని శ్లోకాలు వల్లించినా... మీ మాయ మాటలు ఎవరూ నమ్మరు... కళ్ళ ముందు గణాంకాలు కనపడుతుంటే... ఇంకెన్నాళ్లు... శ్లోకాలు వల్లిస్తూ... మా చెవుల్లో పూలు పెడతారు... రాయిటర్స్ సంస్థ వివిధ దేశాల్లోని నిపుణులను ఫోన్ లోను, ఆన్ లైన్ లోను, వ్యక్తిగతంగానూ సంప్రదించింది. ఈ ఏడాది మార్చ్ 26 నుంచి మే 4 మధ్య ఈ సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం మన దేశంలో కన్నా... సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సోమాలియా దేశాల్లోనే మహిళల భద్రత బెటర్ అంటే... మన దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. ఓవరాల్ గా ఫస్ట్ ర్యాంక్ కాకుండా... విడిగా లైగింక హింస లో మొదటి స్థానం, మహిళల అక్రమ రవాణాలో మొదటి స్థానం, లింగ వివక్షలో మూడో స్థానం, గృహ హింస లో మూడో స్థానం, మహిళల ఆరోగ్యంలో నాలుగో స్థానం తో ఎక్కడా ఏ మాత్రం సిరియాకు...ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లకు తగ్గకుండా చివరి దాకా పోటీలో అన్నింటా అగ్ర స్థానంలో నిలబడి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. రైజింగ్ ఇండియా... ఎందులో రైజింగ్... మహిళలకు భద్రత లేకపోవడంలోనా...ఇది ఒక్క మోడీ తప్పో... లేదా.. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ వారి తప్పో కాదు... తరతరాలుగా మనం ఎంతో గొప్పవని చెప్పుకునే మన సంప్రదాయాల మాటున ఉన్న డొల్ల తనం...
27, జూన్ 2018, బుధవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి