కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అచ్చంగా మహాభారతాన్ని తలపిస్తోంది. ఇక్కడ దుర్యోధనుడు మోడీ. దుశ్శాసనుడు అమిత్ షా. వీరిద్దరూ కలసి ప్రజాస్వామ్యమనే ద్రౌపది కి వలువలు ఊడదీసి నియంతల్లా వ్యవహరిస్తున్నారు. ఓ పక్క భీష్ముడు వాజపేయి అంపశయ్య పై ఉన్నాడు. మరో పక్క దృతరాష్టుడు అద్వానీ పుత్ర ప్రేమతో ఏమి అనలేక నిస్సహాయుడయ్యాడు. ఈ దశలో ఉండబట్టలేక విదురుడు లాంటి మురళి మనోహర్ జోషి పవర్ పాలిటిక్స్ అనే ఓ చిన్న పత్రికలో పరోక్షంగా మోడీ, షాలకు హితబోధ చేస్తూ రాసిన వ్యాసం ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో సంచలనం అయింది. రామాయణ, మహా భారతాలు, కౌటిల్యుడి అర్ధ శాస్త్రాల నుంచి ఉటంకిస్తూ రాజ ధర్మం... పాలకులు ఎలా ఉండాలి ? ప్రాచీన భారతావని నుంచి నేర్వదగిన పాఠాలు అనే శీర్షికతో రాసిన ఆ వ్యాసంలో ఏమున్నదంటే...
రాజు నియంత కారాదు. ఒక చక్రంతో రధం నడవదు... అలాగే ఒకే ఒక వ్యక్తి రాజ్యాన్ని నడపలేడు. ప్రజలకు భావ స్వేచ్ఛ ఉండాలి. చర్చల్లో, సంప్రదింపుల్లో వారు పాల్గొనాలి. ఒక రాజ్యంలో ఈ లక్షణాలు ఉంటేనే అది మంచి పాలన కింద లెక్క. ప్రజలు భయంతో జీవించకూడదు. భయం, హింస, రాక్షస కృత్యాలు లేని రాజ్యం నెలకొల్పడమే రాజధర్మం. చిన్న చేపల్ని, పెద్ద చేపలు మింగేయకుండా రాజు కాపాడాలి. రాజ్యమే పెద్ద తిమింగలంలా మారిపోకూడదు.
అధికారహంకారం నిండా తలకెక్కిన మోడీ, షా లు జోషి హితబోధలు ఏం పట్టించుకుంటారు. ఆయన సూక్తులు పనికిరావనేగా మార్గదర్శక మండలి పేరుతొ అద్వానీ ని, జోషి ని మూల కూర్చోబెట్టారు.
శహభాష్ తమిళ తంబీలు
ఎంత అయినా తమిళ తంబీలు.. తమిళ తంబీలే ... వాళ్ళు మగాళ్ళరా బుజ్జి. నిన్న (మంగళవారం) అమిత్ షా చెన్నయ్ పర్యటనను నిరసిస్తూ గో బ్యాక్ అమిత్ షా అంటూ నెటిజెన్లు విరుచుకుపడ్డారు. ట్వీట్లు, రీట్వీట్లు తో విపరీతంగా ట్రేండింగ్ అయింది. మొత్తం 1,29,000 మంది మద్దతు ప్రకటించారు. ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో ఇది టాప్ 2 లో నిలవడం గమనార్హం. సమానత్వానికి తమిళనాడు వేదిక. నీ లాంటి టెర్రరిస్ట్ ను రానివ్వదు. తమిళనాడు ఇండియా కాదు. తుత్తుకుడి కాల్పులపై అమిత్ షా స్పందించరా.. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు నైతిక బాధ్యత లేదా... అంటూ విరుచుకు పడ్డారు. తమిళ తంబిల్లారా... మీకు శత కోటి వందనాలు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి