విలక్షణ నటుడు కమల్ హాసన్ నటనలోనే కాదు వ్యక్తిగా కూడా విలక్షణమైన వ్యక్తే. తన విశ్వరూపం సినిమాలోని ఓ పాటను కేరళ లో రబ్బర్ తోటల్లో పనిచేసే ఓ అనామకుడు సరదాగా పాడితే... దాన్ని అతని స్నేహితులు యూ ట్యూబ్ లో పెట్టారు. అది వైరల్ అయ్యి కమల్ హాసన్ కంట పడింది. అందరిలాగా విని ఆనందించి వదిలేయలేదు కమల్. ఆ యువకుడి అడ్రస్ తెలుసుకుని, అతన్ని చెన్నయ్ లోని తన కార్యాలయానికి పిలిపించి అభినందించాడు. అసలు విషయమేమిటంటే కేరళ లోని అళపుళా జిల్లా లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రాకేష్ ఉన్ని రబ్బర్ తోటల్లో కూలీ గా పనిచేస్తాడు. సంగీత జ్ఞానం ఏమి లేకపోయినా విశ్రాంతి సమయంలో కూని రాగాలు తీయడం అతనికి అలవాటు. అలాగే ఓ రోజు విశ్వరూపం సినిమాలో ఉన్నయ్ కానాదూ ...నాన్.. అనే పాటను ఆలపించాడు. దానిని అతని స్నేహితులు సెల్ ఫోన్ లో రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టారు. సంగీతంలో ఓనమాలు తెలియకపోయినా గొప్ప గాయకుడి స్థాయిలో రాకేష్ ఉన్ని పాడడంతో ఆ పాట యూట్యూబ్ లో వైరల్ అయింది. అది కమల్ హాసన్ విని దానిని ఆ పాట పాడిన ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ కు పంపాడు. శంకర్ మహదేవన్ అది విని ఆ పాటను తన ట్విట్టర్ లో పెట్టి ఆ యువకుడు స్వర జ్ఞానం తెలిసిన వ్యక్తిలా నాకంటే బాగా పాడాడు అని ట్విట్టాడు. అంతేకాదు అతనిని కలుసుకోవాలని ఉందన్నాడు. అది చూసి కమల్ హాసన్ రాకేష్ ఉన్ని ని చెన్నయ్ లోని తన కార్యాలయానికి పిలిపించి అభినందించాడు. అంతటితో ఊరుకోలేదు. మీడియాను పిలిపించి రాకేష్ ఉన్నిని వారికి పరిచయం చేశాడు. రాకేష్ కలలో కూడా ఊహించనిది కమల్ పెద్ద మనసుతో సాకారమైనది. కమల్ కు, శంకర్ మహదేవన్ కు రాకేష్ ఉన్ని కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు. రేపటి నుంచి సంగీత దర్శకులు రాకేష్ ఉన్ని ఇంటి ముందు క్యూ కట్టినా ఆశ్చర్యం లేదు మరి. దటీజ్ కమల్...
5, జులై 2018, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి