Translate

  • Latest News

    4, సెప్టెంబర్ 2018, మంగళవారం

    64 మంది సిట్టింగ్ ఎం.ఎల్.ఏ లు ఈసారి గల్లంతే...


    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత రహస్యంగా  ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా జరిపించిన రహస్య సర్వేలో 64 మంది సిట్టింగ్ ఎం.ఎల్.ఏలు ఈ సారి వారి వారి నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదని తెలియవచ్చింది. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లీడర్లకు కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో రెండు నెలల పాటు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిపించింది. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం  500 మంది ఓటర్లను వీరు కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి 100 వ ఓటరును ఇంటర్వ్యూ కూడా చేశారు. తాము సేకరించిన సమాచారం మొత్తాన్ని వీరు టాబ్స్ లో నిక్షిప్తం చేశారు. ఆ టాబ్ లు డైరెక్టుగా ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్ లో సర్వర్ కు అనుసంధానం చేశారు. వీరు ఓటర్లను అడిగిన ప్రశ్నలు ప్రధానంగా ఏమిటంటే... 2014 ఎన్నికల్లో మీరు ఏ  పార్టీకి ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు. టి.డి.పీ కి ఓటు వేయాలనుకుంటున్నట్టు  అయితే ఎందుకు వేయాలనుకుంటున్నారు.... సంక్షేమానికా... అభివృద్ధికా... ఇలా సాగాయి ప్రశ్నలు. ఈ సర్వేలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎం.ఎల్.ఏ ల అవినీతి, దౌర్జన్యాలను కూడా పట్టించుకోవడం లేదట. ఆయా నియోజకవర్గాల్లో కులం పాత్ర కొట్టొచ్చినట్టు కనపడిందని తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో... ఓటర్లు కులానికే అగ్ర తాంబూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సర్వే ఆషామాషీగా కాకుండా అత్యంత పారదర్శకంగా జరిపినట్టు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్ నుంచి క్రాస్ చెక్ కూడా చేసినట్టు తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టి.డి.పీ 103 సీట్లలో గెలుపొందగా వై.ఎస్.ఆర్.సి.పీ 66 సీట్లకే పరిమితమై ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఇరు పార్టీలకు చావో...రేవో... అన్నట్టుగా తయారైన వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఎవరికీ పట్టం కడతారో చూడాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 64 మంది సిట్టింగ్ ఎం.ఎల్.ఏ లు ఈసారి గల్లంతే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top