ప్రణయ్ హత్యోదంతం అనంతర పరిణామాలు అభ్యుదయ వాదులకు ఒక కొత్త బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. గతంలో ప్రణయ్ లాంటి ఉదంతాలు చాలా జరిగినా ఆయా సంఘటనలను అందరూ ఏకపక్షంగా ఖండించారే తప్ప నిందితులను ఎవరూ సపోర్ట్ చేయడానికి సాహసించలేదు. కానీ ప్రణయ్ ఉదంతంలో చాలా నిర్భీతిగా... నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా... చాలామంది సోషల్ మీడియాలో హంతకుడు మారుతీ రావుకు మద్దతుగా పోస్ట్లు పెట్టారు... అంతే కాదు అమృతను బండబూతులు తిడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా ప్రమాదకర ధోరణి. దీనికి కారణం. కేంద్రంలో గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న బి.జె.పీ అవలంబిస్తున్న హిందుత్వ అనుకూల ధోరణి కొంతవరకు దానికి దోహదం చేసిందనే చెప్పాలి. అలాగే ఇక్కడ అమ్మాయి తండ్రి కులం కూడా కొంత కారణం. మొదటినుంచి మన సమాజంలో ఎక్కువగా హిందుత్వ అనుకూల, బ్రాహ్మణ వాద ధోరణిలో ఉన్న కులాల్లో బ్రాహ్మణుల తర్వాత ఎక్కువగా పూజలు, పునస్కారాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటించే కులం ఆర్యవైశ్యులు. ఆ కులంలో అమ్మాయి ఒక ఎస్.సి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అమ్మాయి తండ్రి జీర్ణించుకోలేకపోయాడనేది స్పష్టం. ఒకవేళ కూతురు మీద ప్రేమతో సర్దుకుపోదామనుకున్నా... చుట్టూ ఉన్న సమాజం ఆలా సర్దుకుపోనీయదు. ఇక్కడ ఆస్తి కూడా ప్రధానం కాదు. కులమే ప్రధాన అంశం. ఎందుకంటే మారుతీరావు అంత వందల కోట్ల ఆస్తి లేకపోయినా ప్రణయ్ వాళ్ళ ఫామిలీ కి కూడా 30 కోట్ల ఆస్తి ఉందని వాళ్ళ పెదనాన్న చెప్పాడు. ఒక వేళ ఆది అందరిమీద కలిపి అనుకున్నా... ప్రణయ్ వాటా కింద అయినా కనీసం అయిదారు కోట్ల ఆస్తి ఉండవచ్చు. ఏదేమైనా పెళ్ళానికి తిండి పెట్టలేని వాడేం కాదు. పైగా ఉన్నత చదువుల కోసం నెక్స్ట్ ఇయర్ ఫారిన్ వెళ్లాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. అసలు వాళ్ళ పోస్ట్ వెడ్డింగ్ వీడియో చూస్తేనే తెలుస్తుంది... ఎంత రిచ్ గా తీశారో... సో... ఇక్కడ కులమే ప్రధాన అడ్డంకి అనేది స్పష్టంగా తెలుస్తోంది. అదే కులం ఇప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నరహంతకుడు మారుతీ రావు కు మద్దతుగా ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం చేస్తోంది. అసలు టెన్త్ క్లాస్ లో ప్రేమలేమిటి... టీనేజ్ లో వాళ్లకు ఏమి తెలుస్తుంది... 20 ఏళ్ళు అల్లారుముద్దుగా పెంచిన తల్లి దండ్రులను వదిలేసి... ఎవడితోనో పోతారా... అంటూ ప్రేమ పెళ్ళిళ్ళను ఎగతాళి చేస్తూ... అమ్మాయిని నానా బూతులు తిడుతూ పోస్టింగులు పెడుతున్నారు. ఇదంతా వాళ్ళు ఏదో ఆవేశంతో చేస్తున్నది కాదు... ఒక పధకం ప్రకారం చేస్తున్నదే... కాబట్టి అభ్యుదయవాదులందరూ ఇకనైనా మేలుకొని... ఒక్క తాటిమీదకు వచ్చి ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
22, సెప్టెంబర్ 2018, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలా బాధాకరం ! అప్పుడెప్పుడో తాలిబాన్ అంటేనే కరుడు కట్టిన ఊహించని క్రూరత్వానికి ప్రతిపదం గా కనపడేది. ఈ సంఘటన లో నేరస్థులను సమర్ధిస్తున ప్రతి వ్యక్తి ఆలోచన లో ఆ తాలిబాన్ కర్కశ క్రూరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దారుణ మైన విషయంమీమంటే, సమాజాన్ని ఆదర్శంగా నడిపించే బాధ్యత కలిగిన ప్రభుత్వం మరియు రాజకీయ నాయకులు అంటీ ముట్టనట్టు ముక్తసరి గా ఉండటం. అనునిత్యం ప్రేమే కథా వస్తువుగా సినిమా లు తీసి యువత ను ప్రభావితం చేసే ఏ ఒక్కరూ నిర్ద్వంద్వంగా ఖండించక పోవడం దారుణం. మరీ ముఖ్యంగా ఈ సెల్ఫ్ స్టయిల్డ్ సూడో చేగువేర ల ప్రతిస్పందన నీర్లజ్జా కరం, ఎలాంటి పసలేని మాటలు నిజంగా నపంస కుని స్ఖలనం లాంటివి.
రిప్లయితొలగించండి