Translate

  • Latest News

    15, అక్టోబర్ 2018, సోమవారం

    చిన్న నటులు...పెద్ద మనసులు...


    ఆంధ్రప్రదేశ్ లో కోస్తా జిల్లాల్లో మొదటి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా టిట్లి తుఫానుకు చిగురుటాకులా వణికిపోయింది. వేల  కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఒక్క విద్యుత్ శాఖ కే  500 కోట్ల నష్టం సంభవించింది. రోడ్లు, భవనాల శాఖ కు 100 కోట్లు, పంచాయతీ రాజ్ కు 100 కోట్లు, వ్యవసాయం కు 800 కోట్లు, ఉద్యాన శాఖకు 1000 కోట్లు, పశు వైద్య శాఖకు 50 కోట్లు, మత్య శాఖకు 50 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 100 కోట్లు, ఇరిగేషన్ కు 100 కోట్లు నష్టం సంభవించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు  ఇంటీరియం రిలీఫ్ ఫండ్ కింద  అర్జెంటు గా 1200 కోట్లు విడుదల  చేయమని కేంద్రాన్ని కోరారు. ఇదిలా ఉంటే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వాలు చేసే సహాయంతో పాటు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఏంటో కొంత సహాయం చేసి ఆదుకోవడం అందరి కర్తవ్యం. ముఖ్యంగా  సినిమా నటులు ప్రతిస్పందించి తమకు తోచిన రీతిలో సహాయం చేయడం రివాజు. కానీ ఇంతవరకు మన తెలుగు హీరోలు ఎవరూ ఎందుకో ఇంకా ముందుకు రాలేదు ఒక్క విజయ్ దేవరకొండ తప్ప. విజయ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో అయినా గతంలో కేరళ వరదలప్పుడు 5 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించాడు. తర్వాత తనకు వచ్చిన ఫిలిం ఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన 25 లక్షలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి   విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు శ్రీకాకుళం తుఫాన్ కు కూడా అందరి కంటే ముందు స్పందించాడు. 5 లక్షలు విరాళమిచ్చాడు. చేతిలో సినిమాలు లేని కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు కూడా తన శక్తి మేరకు 50 వేలు విరాళం ప్రకటించాడు. పైగా ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే వీరిద్దరూ కుడా తెలంగాణకు చెందిన వారు. మరి ఏ.పీ లో పుట్టి పెరిగిన బడా  హీరోలు ఎందరో ఉన్నారు.. వారెవరు ఎందుకో మరి ఇంతవరకు స్పందించలేదు. చిన్న హీరోలే పెద్ద మనసుతో స్పందించారు. వారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మిగతా తెలుగు హీరోలు కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చిన్న నటులు...పెద్ద మనసులు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top