ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు నుంచే చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా పోషిస్తున్నారు. తన ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన పలు నివేదికల ద్వారా తన ఓటమి ఖాయమని రూఢి అయిపోవడంతో తనకు తాను ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మానసికంగా సన్నద్ధమై పోయారు. ఎంత అయినా క్రైసిస్ మేనేజ్ మెంట్ లో దిట్ట కదా మన చంద్రబాబు. అందుకే పోలింగ్ రోజు నుంచే తాను ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న విషయం మరచిపోయినట్టే వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు సరిగా లేవని, పాడుబడిన భవనాల్లో పెట్టారని, కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని ఎన్నికల కమిషన్ ను విమర్శించారు. అవన్నీ చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అన్న విషయం 40 ఇయర్స్ ఇండస్ట్రీ కి తెలియక కాదు. కానీ తన భవిష్యత్తును తలచుకుని తనను తాను ఒక ప్రతిపక్ష నాయకుడిగా మలచుకుని ఆ రోజు నుంచే ప్రతిపక్ష పాత్ర రిహార్సల్ చేయడం ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ పై పోరాటం మొదలెట్టారు. ఢిల్లి వెళ్లి కేంద్రంలో ప్రతిపక్షాలు అన్నిటిని కలుపుకొని యాగీ చేశారు. జగన్ కాబోయే ముఖ్యమంత్రి అని తన మనసులో డిసైడ్ అయిపోయాడు కాబట్టి జగన్ లోటస్ పాండ్ నుంచి ఐదేళ్లు పరిపాలిస్తాడా అని పోలింగ్ రోజే ప్రశ్నించారు. ఆ రకంగా ఆయన తన మనసులో మాట బయట పెట్టేశాడు. రిజల్ట్ విషయంలో చంద్రబాబు పక్కా క్లారిటీతో ఉన్నారు తన ఓటమి ఖాయమని. అయితే పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మరునాడు అంటే పోలింగ్ మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి పార్టీ కార్యకర్తలు డీలా పడకుండా ఉండటానికి తాము 130 సీట్లు గెలుస్తామని చెప్పాడు. డ్వాక్రా మహిళల ఓట్లు, పెన్షన్ తీసుకునే వృద్ధుల ఓట్లు మావే అని కాకి లెక్కలు చెప్పాడు. పాపం అది విని అప్పటిదాకా గెలుపు మనదేనని గంతులేసిన వై.ఎస్.ఆర్.సి.పీ నాయకులు కొంతమంది కంగారుపడి పునరాలోచనలో పడ్డారు. వాళ్ళు ఎన్నికల అనుభవం తక్కువ కాబట్టి ఆలా కంగారు పడ్డారు కానీ... నిజంగా కంగారు పడాల్సిన అవసరమే లేదు. జగన్ సి.ఎం కావడం తథ్యం. ఆ విషయం చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. డ్వాక్రా మహిళలు, వృద్ధులు అంతా నిజంగా చంద్రబాబుకు వేసేసి ఉంటారనా ... మీ అనుమానం... సరే... మీ కోణంలోనే ఆలోచిద్దాం... రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091.
మొన్న జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావితం చేసిన గ్రూపులు ప్రధానంగా నాలుగు .
1. డ్వాక్రా మహిళలు
2. పెన్షన్ తీసుకున్న వృద్ధులు, నిరుద్యోగ భృతి అందుకున్న నిరుద్యోగులు
3.రైతులు
4. కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లు
వీరిలో డ్వాక్రా మహిళలు మొత్తం 94 లక్షల మంది. వీరంతా తెలుగు దేశానికి వేస్తే ఇంకా ఆలోచించాలసిందేముంది. కానీ మనది కులాల కుంపట్ల రాజ్యం... ఇక్కడ అన్నింటికంటే అత్యంత ప్రభావితం చేసేది కులం. డ్వాక్రా మహిళల్లో 80 శాతం మంది బి.సి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలు... వీరిపై వారి వారి కుటుంబ సభ్యులు... అంటే భర్త, లేదా కొడుకు, లేదా తండ్రి ప్రభావం ఉంటుంది. పై వర్గాలన్నీ టీ.డీ.పీ ప్రభుత్వంలో అణచివేయబడ్డ వర్గాలు. అధికార పార్టీకి చెందిన సామాజిక వర్గం చేతుల్లో రకరకాలుగా బాధలు అనుభవించిన వాళ్ళు. అంత తేలికగా మర్చిపోయి... పసుపు కుంకుమ కింద ఇచ్చిన 10 వేలు తీసుకుని చంద్రన్నకు ఓటు వేసేస్తారా... పైగా జగనన్న అధికారం లోకి వస్తే డ్వాక్రా ఋణం మొత్తం మాఫీ చేస్తానన్నాడు కదా... ఈ 10 వేలు ఎక్కువా... ఆ ఋణం ఎక్కువా... డ్వాక్రా మహిళలు ఆ మాత్రం ఆలోచించారనుకున్నారా... చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకున్నారా...
ఇక వృద్ధులు, నిరుద్యోగుల సంగతికి వస్తే... పెన్షన్ తీసుకునే వృద్ధుల సంఖ్య 65 లక్షల మంది. వీరిలో కొంత వరకు 2 వేలు ఇచ్చిన ప్రభావం ఉంటుంది. కానీ వీరిపైనా కూడా ఆయా కుటుంబ సభ్యుల ప్రభావం తప్పకుండా ఉంటుంది.
మూడో వర్గం రైతులు... రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పధకం కింద లబ్ది పొందిన రైతులు 45 లక్షల మంది. చంద్రబాబు పాలనలో రైతులు పడిన కస్టాలు అన్నీ..ఇన్నీ కావు కదా.... అన్నదాత సుఖీభవ అనగానే వాళ్ళంతా చంద్రబాబుకు ఓట్లు వేసేస్తారా....
నాలుగో వర్గం వర్గం కొత్త ఓటర్లు... కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లు 5,39, 804 మంది. అంటే పోయిన ఎన్నికల్లో సరిగ్గా జగన్ కు తగ్గిన ఓట్ల సంఖ్య. వీరంతా ఎక్కువగా సోషల్ మీడియా ను ఫాలో అవుతుంటారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం ఓటర్లు జగన్ వైపు, 30 శాతం ఓటర్లు పవన్ వైపు, కేవలం 10 శాతం ఓటర్లు మాత్రమే చంద్రబాబు వైపు మొగ్గు చూపినట్టు ఒక అంచనా...
ఇదండీ... సంగతి... ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా... భావి ముఖ్యమంత్రి ఎవరో...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి