కామరాజ్ నాడార్ అంటే ఈ తరానికి అస్సలు తెలియదు. ఎందుకంటే ఆయనది 50 ఏళ్ల క్రితం నాటి చరిత్ర. 1960 వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగి... సంచలనాలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి. స్వాతంత్ర్యానంతరం దేశ చరిత్రలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అతి కీలక ఘట్టాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. 1964 లో మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి ని ప్రధాన మంత్రిని చేయడంలోనూ, ఆ తర్వాత ఏడాదికే శాస్త్రి ఆకస్మిక మరణానంతరం ఇందిరా గాంధీని ప్రధాన మంత్రి ని చేయడంలోనూ కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే... 1963 నాటికే దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతుండడం గమనించిన కామరాజ్ నాడార్... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక సంచలనాత్మక ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చాడు. అదేమిటంటే... పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి ప్రభుత్వంలో మంత్రులుగా కీలక పదవుల్లో ఉన్న వారు తమ పదవులను త్యాగం చేసి, పార్టీ కోసం పనిచేయాలి... ఇది కామరాజ్ ప్లాన్ గా అప్పట్లో బహుళ ప్రాచుర్యం పొందింది.
అసలు ఎవరీ కామరాజ్ నాడార్...
కామరాజ్ నాడార్ తమిళనాడుకు చెందిన నాయకుడు. స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని, తదనంతరం 1954 నుంచి 1963 దాకా తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆ రాష్ట్ర మౌలిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆ తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 1964 నుంచి 1967 మధ్య కాలంలో అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన బుర్ర లోంచి వచ్చినదే ఈ కామరాజ్ ప్లాన్. అయితే అది ఆచరణకు నోచుకోకపోయినప్పటికీ... అప్పటికి... ఇప్పటికి మేధావుల ప్రశంస పొందిన అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచనను అమలు చేయాలంటే ఏ పార్టీకయినా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చి, అటు పార్టీలోనూ... ఇటు ప్రభుత్వంలోనూ తిరుగులేని ఆధిపత్యం ఉండాలి. అన్నీ ఉన్నా ఆ పార్టీ నాయకుడికి అది అమలు చేసే గట్స్ ఉండాలి. అందుకే ఇందిరాగాంధీ వంటి మహామహులు కూడా దీని జోలికి పోలేదు.
జగన్ కే సాధ్యం...
కామరాజ్ నాడార్ ప్లాన్ అమలుచేయడం ఒక్క జగన్ కే సాధ్యం. ఆయన వయసు చిన్నదయినా... బుర్ర పెద్దది. అందరూ ముందుగా ఉహించినట్టుగా మంత్రివర్గంలో రోజా కు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి మంత్రి పదవులు రాకపోవడానికి కారణం ఈ కామరాజ్ ప్లాన్... ఈ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న 25 మంది మంత్రుల్లో దాదాపు 20 మంది మంత్రులు తమ పదవులు త్యాగం చేసి పార్టీ సేవకు పరిమితం కావలసి ఉంటుంది. వారి స్థానంలో రోజా, ఆర్కే లాంటి మెరికల్లాంటి మంత్రులతో 2024 ఎన్నికలు ఎదుర్కోవాలనేది జగన్ ప్లాన్. ముఖ్యమంత్రి అయిన పది రోజుల్లోనే అద్భుతమైన పరిపాలనా దక్షతతో రాష్ట్ర ప్రజల మన్ననలతో పాటు, మేధావుల ప్రశంసలు అందుకుంటున్న జగన్ ఇటు పార్టీ పరంగా కూడా కామరాజ్ ప్లాన్ అమలు చేయడం ద్వారా సరికొత్త రాజకీయాలకు నాంది పలుకుతున్నాడు... సెహబాష్ జగన్... గో ఎహెడ్...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి