పల్నాటి పులి.... బతికినన్నాళ్లు ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా బతికిన కోడెల శివప్రసాదరావు... తన జీవిత చరమాంకంలో చేసిన తప్పులన్నీ ఒక్కసారిగా అనకొండలా చుట్టుముట్టగా... కొండచిలువ అష్టదిగ్బంధనంలో చిక్కి ఎటూ కదలలేక....చేష్టలుడిగి జీవశ్శవమైన కొదమసింహం లా... చివరకు... అంతటి ధీరోదాత్తుడు....పిరికిపందలా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు... వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల మానసికంగా దుర్బలుడై ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు... కోడెల కుమారుడి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆయన బావమరిది సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఇంతకూ కోడెల ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలేమిటి... ఎవరు కారకులు...?
ప్రతి సంఘటనకు ముందు...వెనుక... అందుకు దారితీసిన కారణాలు వేరే ఉంటాయి... కానీ... సంఘటన జరిగిన సమయంలో అలుముకున్న ఆవేశకావేశాల నడుమ.... వాస్తవాలు మరుగున పడతాయి.... అవాస్తవాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయి... తత్ఫలితంగా కొన్ని అనుకోని...దుష్పరిణామాలు కూడా సంభవిస్తాయి. ఇటువంటి దుస్సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి వాస్తవాధీన రేఖపై నిలబడి మాట్లాడాలి. అంతే కానీ.... జరిగిన దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదు... కానీ ప్రతిపక్ష నాయకుడు పాలక పార్టీ పై పోరాయటానికి ఆయుధం దొరికిందన్నట్టు... శవ రాజకీయం మొదలుపెట్టాడు... అధికార పార్టీ పై సమరశంఖం పూరించాడు... రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో కోడెల సంతాప సభలు నిర్వహించాలని చెప్పాడు... అంతవరకూ ఓ.కె... కానీ... కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వ వేధింపులే కారణమంటూ పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టాలని పిలుపునిచ్చాడు. ఇంతలోనే సాయంత్రానికి కోడెల బావమరిది సాయిబాబు... కోడెల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ... కోడెల ఆయన కుమారుడి వేధింపులు తట్టుకోలేకే ఇలా చేసివుండొచ్చని... ఆ విషయం గత నెల రోజుల్లో మూడు, నాలుగు సార్లు నాకు ఫోన్ చేసి చెప్పాడని అంటూ... ఆ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు... దీంతో పాపం చంద్రబాబు పిలుపు కు స్పందన లేకుండా పోయింది.. పార్టీ వర్గాలే పునరాలోచనలో పడ్డాయి.
వాస్తవాలు పరిశీలిస్తే కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణం... ఎందుకంటే పార్టీ కి 36 ఏళ్లుగా సేవ చేసి... పార్టీలో కీలక నాయకుడైన కోడెల కేసుల్లో చిక్కుకున్న పరిస్థితుల్లో గత నెల రోజులుగా ఏనాడూ కోడెలకు నైతిక మద్దతుగా చంద్రబాబు ఒక్క మాట మాట్లాడకపోగా... ఆయన వలన పార్టీ పరువు పోయిందంటూ వర్ల రామయ్య లాంటి వారు మాట్లాడినప్పుడు కనీసం ఖండించలేదు... అప్పుడు కోడెల కు సపోర్ట్ గా ఒక్క మాట మాట్లాడినా ఎక్కడ తాను... తన పార్టీ బదనాం అయిపోతుందేమోనని భయపడిపోయాడే తప్ప... కోడెల కు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి ఇవాళ... కోడెల ఆత్మహత్యను రాజకీయం చేస్తూ... అధికార పార్టీ వేధింపుల వల్లే... ఆత్మహత్య చేసుకున్నాడంటూ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదం... కోడెల తన జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన్ను ఒంటరి వాడిని చేసిన తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే కోడెల ఆత్మహత్యకు అసలు కారణం... పురిగొల్పిన అసలు నిందితులు అని ఎందుకు అనుకోకూడదు..? ఎందుకంటే ప్రతిపక్షానికి కోడెల ఎప్పుడూ భయపడలేదు... స్వపక్షం చేసిన వెన్నుపోటుకే మనోవేదన చెందాడు... దానికి తోడు... కన్న కొడుకు...కూతురు... చేసిన వెధవ పనులు... పెడ్తున్న వేధింపులు... కోడెల వై.సీ.పీ వేధింపులకు ఆత్మహత్య చేసుకునివుంటే... అసలు పోలింగ్ రోజు బూత్ లో ఆయన్ను చొక్కా చింపి...పరాభవం చేసి... వెంటపడి తరిమి..తరిమి కొట్టినప్పుడే చేసుకోవాల్సింది.. అంతకంటే.. ఆయనకు జీవితంలో వేరే పరాభవముందా... సో... కోడెల ఆత్మహత్యకు సొంత పార్టీ...సొంత మనుషులే కారణం తప్ప...అధికార పార్టీ ఎంత మాత్రం కాదు...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి