Translate

  • Latest News

    19, ఏప్రిల్ 2020, ఆదివారం

    బోనులో మ‌నిషి... బోను బ‌య‌ట వ‌న్య‌ప్రాణులు


     నిత్యం సందడిగా ఉండే హైద‌రాబాద్  జూ పార్కులో లాక్‌డౌన్‌ కారణంగా నిశ్శబ్దం ఆవహించింది. మామూలు సమయంలో వన్యప్రాణులను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. వాటిని చూసిన ఆనందంలో చిన్నారుల కేరింతలు, అరుపులతో ఆ ప్రాంతం మార్మోగేది. కరోనా వైరస్‌ నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు జూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో వేడి నుంచి కాపాడేందుకు చర్యలు చేపట్టారు. వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. జూపార్కులో సందర్శకులు లేకపోవడంతో వన్యప్రాణులు ఎంజాయ్‌ చేస్తున్నాయి. ఫుల్‌ జోష్‌తో ఉండటంతో పాటు అడవిలో ఉన్నట్లు ఫీల్‌ అవుతున్నాయి.  

    నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని జంతువులు రోజంతా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌  ప్రభావం ఇక్కడి జూ పార్కులో కనిపించడం లేదు. ఎలాంటి టెన్షన్‌ లేకుండా వణ్యప్రాణాలు సరదాగా గడుపుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా విజిటర్స్‌కు అనుమతి లేకపోయినప్పటికీ.. జూలో ఎప్పటిలాగే కార్యకాలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు విజిటర్స్‌తో సందడిగా ఉండే జూపార్కు.. కొద్దిరోజులుగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. విజిటర్స్‌ చప్పుళ్లు, చిన్నారుల కేరింతలు, బ్యాటరీ వాహనాల రాకపోకలు, చిట్టిరైలు ప్రయాణాలతో జూపార్కులో సందడే.. సందడి. ఇవ్వన్నీ ఇక్కడి జంతువులన్నీ అలవాటైపోయాయి.

    ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ.. విజిటర్స్‌ ఎవరూ రాకపోవడంతో ప్రతిరోజు ఎన్‌క్లోజర్ల వద్దకు యానిమల్‌ కీపర్స్, వెటర్నరీ డాక్టర్స్‌ ఇతర సిబ్బంది వెళ్తున్నారు. వీరితోనే కాలక్షేపం చేస్తున్న జంతువులకు ఎక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు, యానిమల్‌ కీపర్లు ఇతర సిబ్బంది రౌండ్‌ ది క్లాక్‌ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జూలోని జంతువులన్నీ ప్రశాంతంగా గడుపుతున్నాయి. వేళకు ఫీడింగ్‌ అయిపోగానే.. ఎన్‌క్లోజర్స్‌లో కాలక్షేపం చేస్తున్నాయి. డే ఎన్‌క్లోజర్స్‌ సమయం ముగియగానే.. నైట్‌ ఎన్‌క్లోజర్స్‌లోకి వెళ్తున్నాయి.

    విజిటర్స్‌ లేనంత మాత్రానే జూలోని జంతువులను నైట్‌ ఎన్‌క్లోజర్స్‌కు పరిమితం చేయడం లేదు. యథావిధిగానే రోజువారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గుహలకే పరిమితం కావడం లేదు. వాటి ఎన్‌క్లొజర్స్‌లలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఉదయం 10:30 గంటల కల్లా ఫీడింగ్‌ పూర్తి కాగానే జంతువులను రిలీజ్‌ చేస్తూ.. సాయంత్రం 4:30 గంటలకు తిరిగి నైట్‌ ఎన్‌క్లోజర్‌లకు పంపిస్తున్నారు. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో.. గర్భినిగా ఉన్న సైనా అనే ఎల్లో టైగర్‌ పండంటి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అలాగే నక్క జాతికి చెందిన జకాల్‌ అనే జంతువు 6 పిల్లలకు జన్మనిచ్చింది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బోనులో మ‌నిషి... బోను బ‌య‌ట వ‌న్య‌ప్రాణులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top