Translate

  • Latest News

    23, ఆగస్టు 2017, బుధవారం

    జగన్ ప్రకటనతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ. .. కొత్త జిల్లాల ఏర్పాటు క్రెడిట్ టిడిపికి దక్కుతుందా..?

    ఏపీ లో కొత్త  జిల్లాల ఏర్పాటు 
    జగన్ ప్రకటనతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ. 
    కొత్త జిల్లాల ఏర్పాటు క్రెడిట్ టిడిపికి దక్కుతుందా..?
     వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ నంద్యాల ఎన్నికల ప్రచార సభలో తాము అధికారంలోకి వస్తే ప్రతి డివిజన్ సెంటర్ ను జి ల్లా కేంద్రంగా మారుస్తామని హామి ఇచ్చారు.దీంతో మరోసారి ఈ అంశం చర్చకువచ్చింది. ఈ విషయంపై ఏపీ సర్కారులో స్పష్టమైన అలోచన కరువైనట్లు స్పష్టమౌతుంది. కేంద్రం నియోజకవర్గాల పునర్విభన చేసిన అనంతరం ఈ అంశంపై ముందుకు వెళ్లాలని గతంలో ప్రభుత్వం అలోచన చేసింది. అయితే నియోజకవర్గాల పునర్విభనపై కేంద్రం నిర్దిష్టమైన ప్రకటన చేయటంతో అయోమయం నెలకొంది. మూడు సంవత్సరాలుగా ఈ అంశంపై దాటవేట దోరణి అనుసరించిన ప్రభుత్వానికి జగన్ ప్రకటనతో కదలిక వస్తుందని ఆశిస్తున్నారు. ఎన్నికలకు ముందే కొత్త జిల్లాల ఏర్పాటు చేసి జగన్ కన్నా  ముందే క్రెడిట్ కొట్టివేయాలని కొంతమంది మంత్రులు సూచించినట్లు సమాచారం.
     కొత్త జిల్లాల ఏర్పాటు క్రెడిట్ టిడిపికి లభిస్తుందా. 
    పరిపాలనా సౌలభ్యం అనే పేరుతో కెసిఆర్ తెలంగాణా ను 2016 అక్టోబర్లో ముప్పై పైగా జిల్లాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. 1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418 కాగా .2015 లో 678 అయ్యాయి. 2016 అక్టోబరులో తెలంగాణాలో ఒక్కసారే 21 కొత్తజిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లా కేంద్రం అంటే జిల్లా అభివృద్ధికి కేంద్రం. సాధారణంగా రాజధాని చుటూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. జిల్లా కేంద్రం చూటూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. 111 ఏళ్ల తరువాత తెలంగాణాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. సరిగ్గా 111 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనే పాలకులకు రాలేదు. 1905లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 1953లో ఏర్పడిన ఖమ్మం జిల్లా 1978లో ఏర్పడిన రంగారెడ్డి జిల్లా మినహాయిస్తే, మిగిలిన తెలంగాణలోని జిల్లాలన్నీ 111 సంవత్సరాల క్రితం ఏర్పడినవే. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడింది . సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కింది నుంచి మూడవ స్థానంలో ఉత్తరాఖండ్ సరసన ఉంటుంది. ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణ యించారు. ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవు వల్ల బందరును జిల్లా కేంద్రం చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది. జిల్లా లు పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. తిరుపతి జిల్లా కేంద్రం కాదు. రాజమండ్రి జిల్లా కేంద్రం కాదు. జిల్లా కేంద్రం కాకముందే వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.కొత్త జిల్లాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తూనే ఉ న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ కన్నా చిన్నదైన అస్సాంలో 35 జిల్లాలు ఉన్నాయి.తెలంగాణాలో పాలనా వ్యవస్థలో భారీ అధికార వికేంద్రీకరణ జరిగింది. 38 ఏళ్ల తర్వాత తెలంగాణ లో   21 కొత్త జిల్లాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఉ నికిలోకి వచ్చాయి. దీంతో  ఆ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి. జిల్లాల పరమార్థం అభివృద్ధి  వికేంద్రీకరణే.జిల్లా యూనిట్గా కేంద్రంనుంచి రావాల్సిన నిధులు పెరిగి, అవి నూతన అభివృద్ధి కేంద్రాలుగా రాణిస్తాయి.కొత్త జిల్లాలతో ప్రజలకు దూరాభారాలు, వ్యయప్రయాసలు తగ్గి త్వరితంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రజలకు ప్రయాణ  ఖర్చులు  తగ్గుతాయి. జిల్లాల సంఖ్య పెరుగుదలతో ఉద్యోగుల సంఖ్య  పెంచవల్సి వస్తుంది. అది ఉపాధి అవకాశాలు పెంచేందుకు కారణమౌతుంది. ఇన్ని ప్రయోజనాలు సిద్దించే నూతన జిల్లాల ఏర్పాటు 2019 ఎన్నికల నాటికి టిడిపి ప్రభుత్వం పూర్తి చేసి క్రెడిట్ కొట్టేస్తుందా. లేదా అన్నది వేచి చూడాలి.
    జోడింపుల ప్రాంతం
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ ప్రకటనతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ. .. కొత్త జిల్లాల ఏర్పాటు క్రెడిట్ టిడిపికి దక్కుతుందా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top