సూసైడ్ గేమ్
'బ్లూ వేల్ చాలెంజ్' అనే ఓ కొత్త ఆన్‌లైన్ చిన్నారుల ప్రాణాలనుహరించి వేస్తుంది రష్యాలో ప్రారంభమైన ఈ గేమ్ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిలీలో ఈ గేమ్ ప్రకంపనలుసృష్టిస్తోంది. ఈ గేమ్ బారినపడి అనేక మంది చిన్నారులు ప్రాణాలుకోల్పోతున్నారు.
ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఓ 14 ఏళ్ల అబ్బాయి సూసైడ్చేసుకున్న విషయం తెల్సిందే. అంధేరి ఈస్ట్‌లో ఉండే ఆ చిన్నారి సోషల్మీడియాలో ఈ గేమ్ గురించి తెలుసుకుని గేమ్‌లో పార్టిసిపేట్ చేశాడు.ఆ తర్వాత ఎలాగైనా ఈ గేమ్‌లో విన్ అవ్వాలని తను ఉండే బిల్డింగ్‌లోఐదో అంతస్థు నుంచి కిందికి దూకి తన ప్రాణాలను తీసుకున్నాడు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, సూసైడ్చేసుకున్న చిన్నారికి బ్లూ వేల్ చాలెంజ్‌కు సంబంధాలు ఉన్నట్టుగుర్తించారు. దీంతో భారత్‌లో కూడా ఈ గేమ్ ఆడుతున్న వారు ఉన్నట్టుపోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ గేమ్ బారిన పడి రష్యా,యూకేలో ఇప్పటికే దాదాపు 130 మంది చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోవడం గమనార్హం.
అసలు బ్లూ వేల్ చాలెంజ్ గేమ్ రష్యాలో ప్రారంభమైంది. ఇది ఇప్పుడుభారత్‌కు పాకింది. నీలి తిమింగలం చాలెంజ్ గేమ్‌ను ఓ సోషల్మీడియా గ్రూప్ రన్ చేస్తుంటుంది. ఈ గేమ్‌లో పాల్గొనదలచిన వారుగేమ్ నిర్వాహకులు చెప్పినట్లు చేయాలి. చేసితీరాలి. 50 రోజులు వాళ్లుఇచ్చే టాస్కులు చేస్తూ ఉండాలి. ముందు ఓ పేపర్‌పై తిమింగలంబొమ్మను వేయాలి. తర్వాత ఈ బొమ్మను తమ శరీరంపై వేసుకోవాలి.
పిమ్మట హార్రర్ సినిమాలు చూడటం, అర్థరాత్రులు లేవడం.. నడవటంవంటి టాస్కులు చేయాలి. అలా 50 రోజులు 50 టాస్కులు పూర్తి చేసినతర్వాత నిజంగానే సూసైడ్ చేసుకోవాలి. దీన్నే సెల్ఫ్ డిస్ట్రాయింగ్అంటారు. ఈ గేమ్‌లో గెలవాలంటే ఖచ్చితంగా సూసైడ్చేసుకోవాల్సిందేనని నిర్వాహకులు పార్టిసిపెంట్స్‌పై ఒత్తిడి తెస్తారు. దీంతోగేమ్ గెలవాలన్న ఆరాటంతో అనేక మంది చిన్నారులు నిలువునాప్రాణాలు తీసుకుంటున్నారు. ఇపుడు ఈ గేమ్ చాలా దేశాలకువిస్తరిస్తోంది. దీంతో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
బ్లూవేల్ విస్తరణను అడ్డుకోవాలంటూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు
బ్లూ వేల్ ఆన్‌లైన్ గేమ్ వల్ల విద్యార్థులు ఆత్మాహత్య చేసుకుంటున్నఘటనలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తమ అనుబంధ స్కూళ్లకు కొన్నిమార్గదర్శకాలను సూచించింది. స్కూళ్లలో వాడే కంప్యూటర్లకుపటిష్టమైన మానిటరింగ్, ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్‌ను అమర్చాలని సీబీఎస్ఈతన ప్రకటనలో ఆదేశించింది. బ్లూవేల్ విస్తరణను అడ్డుకోవాలంటూసోషల్ మీడియా సంస్థలైన గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్,మైక్రోసాఫ్ట్, యాహూలకు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది. రక్షణ వ్యవస్థ అవగాహన లేకుండా ఇంటర్నెట్‌ను వాడడంవల్ల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, వాళ్లు సైబర్అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని సీబీఎస్ఈ పేర్కొన్నది.అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులపై నిఘా పెట్టడం అవసరమని ఆప్రకటన వెల్లడించింది. సోషల్ సైట్లపై ఎలా సేఫ్‌గా ఉండాలన్నఅంశాలను కూడా సీబీఎస్ఈ తన సర్క్యూలర్‌లో సూచించింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి