హాట్సాఫ్ సోషల్ మీడియా . సాక్షికి బాలకృష్ణపై అంత ప్రేమెందుకు.
నంధ్యాల ఉప ఎన్నిల సమరం. వైరీపక్షాలు డీ అంటే ఢీ అని ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. చావో రేవో అన్న చందాన ప్రవర్తిస్తున్నాయి. ఈ దశలో ప్రచారాలు చివరి స్థాయిలో వచ్చేస్తున్న సమయంలో సీనిప్రముఖులను కూడా ఓటర్లను అకర్షించేందుకు రంగంలో దింపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సినీ హిరో, ముఖ్యమంత్రి వియ్యంకుడు బాలకృష్ణను టిడిపి తరుపున ప్రచారంలోకి దించారు. తన సహజ సిద్ద ప్రవర్తనతో అతను ఓ అభిమానిపై దాడి చేశారు.పక్కనే ఉన్న గన్ మేన్ కూడా అభిమానిపై చేయిచేసుకున్నాడు. అప్పటికే అక్కడే ఉన్న కొంతమంది ఈ తతంగాన్ని రికారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైఎస్సార్ సీపీ కి అనుబంధంగా సాక్షి దినపత్రికకు ఈ సమాచారం అందింది. లేకలేక ఒక్క అవకాశం వచ్చింది. దాన్ని పెద్ద బ్యానర్ ఐటంగా వండి వార్చి సాక్షిలో ప్రచురితమౌతుందని వైఎస్సార్ సీపీ అభిమానులు ఆశించారు. ఈ నెల 16వ తేదీ లోపలి పేజీలో పేరు ఊరు లేకుండా అభిమానిపై సినీహీరో దాడి అంటూ ఒక కాలమ్ లో వార్తను ప్రచురించారు. ఈ లోగా బాలకృష్ణ తన్నుడు కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ కావటం, వివిధ వెబ్ సైట్లలో ప్రచారం కావటంతో సాక్షి దిద్దు బాటు చర్యల్లో భాగంగా 18వ తేదీ బాలయ్య డబ్బులు పంచటం, అయనంతే అంటూ కథనాలను ప్రచురించింది. కొన్ని నిజాలు దాగాలన్న దాగవు. అదీ సోషల్ మీడియా కన్నుల నుంచి ఏది దాటిపోదు. హాట్సఫ్ సోషల్ మీడియా. ఇదంతా చూస్తున్న వారికి బాలయ్యపై సాక్షికి అంతప్రేమ ఎందుకబ్బా. సంశయం కలగక మానదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి