ఈ వార్త తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఆవేదనకు గురి చేసే అంశమే . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియ రంగంలో ఒక వెలుగు వెలిగిన జెమిని న్యూస్ మూగబోనుంది. అక్టోబరు 24వ తేదీన జెమినీ ఊపిరి ఆగిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థ ఉద్యోగులకు ఇవాళ ఉదయమే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి హైదరాబాద్ జెమిని ఆఫీసుకు సర్యూలర్ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అక్టోబరు 24 వరకు మాత్రమే ఉంటుందని తర్వాత జెమిని మూసివేత జరుగుతుందని ఉద్యోగులకు యాజమాన్యం తేల్చి చెప్పారు. అయితే ఉద్యోగులకు ఇచ్చే పరిహారంపై ఎలాంటి సమాచారం ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం జెమిని న్యూస్, తేజ న్యూస్ లో కలిపి సుమారు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారంతా రోడ్డు మీద పడనున్నారు. అయితే సన్ నెట్ వర్క్ కు చెందిన మరో చానల్ కూడా మూసివేత దిశగా సాగుతోంది. కన్నడంలోని ఉదయ న్యూస్ మూసివేస్తామని అక్కడి ఉద్యోగులకు కూడా సమాచారం అందింది. ఈ రెండు చానెళ్లు కూడా అక్టోబరరు 24న మూసివేస్తామని సంకేతాలు అందాయి. ఈ రెండు సంస్థలు నష్టాల్లో ఉన్న కారణంగా మూసి వేస్తున్నట్లు సన్ నెట్ వర్క్ నిర్ణయం తీసుకుంది.
అయితే జెమినీ ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో తిరుగులేని స్థానంలో ఉన్నప్పటికీ న్యూస్ లో మాత్రం నష్టాలు వస్తున్నయని అందుకే నష్టాలు వస్తున్న సంస్థను కొనసాగించలేమని సన్ నెట్ వర్క్ యాజమాన్యం చెబుతోంది. నిజానికి జెమిని న్యూస్ టామ్ రేటింగ్స్ లో అట్టడుగు స్థాయిలో కొనసాగుతోంది. యాడ్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయని, ఇక నడిపే ఉద్దేశం లేదని సంస్థ యాజమాన్యం వెల్లడించింది.
రెండు దశాబ్దాలుగా తెలుగు నేల మీద నిరంతర వార్తలు అందించిన జెమిని న్యూస్ మూసివేత నిర్ణయం ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకే కాకుండా యావత్ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్లాటప్పా చానళ్లు కోకొళ్లలుగా వచ్చి టపీ టపీమని మూతపడుతున్న తరుణంలో ఒక పెద్ద సంస్థ తీసుకొచ్చిన చానెల్ ఇలా మూతపడడం బాధాకర పరిణామం
![]() |
Click here to Reply or Forward
|
0 GB (0%) of 15
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి