Translate

  • Latest News

    23, సెప్టెంబర్ 2017, శనివారం

    రామ్‌దేవ్ బాబా చెప్పేది వినండి.


    ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు   మీ పరిశోధనలు ఆపండి. ప్రపంచ దేశాధినేతలు పరిశోధనలకు వెచ్చిస్తున్న నిధులు ఆపివేయండి. డాక్టర్లు మీ వైద్యాన్ని ఆపివేయండి. మానవ జాతి ఉద్దరణ కోసం బాబా వారి సందేశాలు ,అయన కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేయండి .  దీర్ఘకాల జీవితం గడపండి .ముందు  రామ్‌దేవ్ బాబా చెప్పేది ముందు వినండి. 12వ ‘నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్’ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్‌బాబా... దీర్ఘకాల జీవితం గురించి పలు రహస్యాలు వెల్లడించారు. మానవశరీరం 400 సంవత్సరాల పాటు జీవించేందుకు యోగ్యమైనదని, అయితే మానవులంతా అస్తవ్యస్త జీవనశైలితో రోగాల బారినపడి తనువు చాలిస్తున్నారని ఉపదేశించారు.  ఇటువంటి విధానానికి విముక్తి పలకాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, మెరుగైన జీవన శైలిని అలవరచుకోవాలన్నారు. అథిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధుల కారణంగా జీవితకాలం తగ్గిపోతున్నదన్నారు. తాను చెప్పిన విధానాలను అవలంబించడం వలన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 38 కిలోల బరువు తగ్గారని రామ్‌దేవ్ బాబా మరోమారు తెలిపారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రామ్‌దేవ్ బాబా చెప్పేది వినండి. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top