బాబాలంతా కామ్ (త )దాసులే అన్నది మరోసారి వెల్లడయింది .కామ తురాణం నభయం నలజ్జ అన్నారు. ఆలా సిగ్గు లేని పనులు చేసి గతం లో కటకటాలు లెక్కిస్తున్న కటకటాల బాబాలు కూడా మహిళల జోలికి వచ్చిన వారే . భారతీయ వనితకు భక్తి ఎక్కువే . కానీ అదే సందర్భంలో అన్యాయం జరిగితే మగవారి కన్నా ముందుగా స్పందించటం లోను , తప్పు చేసిన వారి తాట తీయటంలో ను ముందంజ లో నే ఉంటుంది. దొంగ బాబాల భాగోతాలను బయట పెట్టింది మహిళలే అన్న విషయం మరిచి పోరాదు.
ఈ కోవలో మరో కామ బాబా భోగోతం బయటకు పొక్కింది ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన యువతి లా విద్యాభ్యాసం చేసింది. ఇంటర్న్‌షిప్ కూడా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఆనందాన్ని తన బంధువైన ఫలాహరీ బాబాతో పంచుకుందామని అదేపట్టణంలో ఉన్న ఫలాహారీ బాబా దగ్గరకు వెళ్లింది. పూజలో ఉన్న బాబాను కలిసేందుకు అతని గదిలోకి వెళ్లింది.హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన బాబా, యువతిని చూసి తలుపుగడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు.
ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన యువతిపై అకృత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌కు చెందిన ఫలాహారీ బాబాపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ బాబా గతంలో ఇతర మహిళలపై కూడా అఘాయిత్యాలు సాగించాడని ఆరోపించారు. తామంతా బాబాను దైవ స్వరూపంగా భావిస్తామని, అయినా బాబా ఈ దురాగతాలకు పాల్పడడం దారుణంగా ఉందన్నారు. పోలీసులు తక్షణం బాబాపై చర్యలు చేపట్టాలని కోరారు. కాగా దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలిని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. అక్కడ అన్నిగదులలో తనిఖీలు చేపట్టారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినదని చెబుతున్న గదిలో పోలీసులకు ల్యాప్‌టాప్, సీడీలు, మహిళల ఆభరణాలు లభ్యమయ్యియి. అలాగే ఆశ్రమంలో అమర్చిన సీసీటీవీల అవుట్‌పుట్ ఉన్న హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులకు కీలక ఆధారాలు దొరికినట్లయ్యింది. ఇదిలాఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫలాహారీ బాబాను ఐసీయూ నుంచి మరో వార్డుకు తరలించారు. ఇప్పుడు బాబా ఆరోగ్యం సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి