జలుబు అనేది చాలా తేలికగా ఒకళ్ళ నుంచి మరో కళ్ళకు సోకుతుంది. వైరస్ వ్యాప్తితో తేలికపాటి జ్వరం, కళ్ళనుంచి, ముక్కునుంచి నీళ్ళు కారడం, ముక్కు దిబ్బెడ, తలనొప్పి లక్షణాలు, గొంతు కూడా బొంగరుపోవచ్చు. ఈ లక్షణాలు కలగడానికి ఎన్నో రకాల వైరస్‌లు కారణం. సాధారణంగా సూక్ష్మజీవులనైతే ముక్కలోపలి యంత్రాంగం అడ్డుకోగలదు. కానీ ఈ అతిసూక్ష్మమైన వైరస్ ముక్కు ద్వారా లోపలికి వెళ్లి శ్వాసనాళాన్ని, గొంతుని కూడా ఇన్‌ఫెక్ట్ చేస్తాయి. తమ్ము ద్వారా దగ్గుద్వారా ఇవి చుట్టూ వున్న వాతావరణంలోకి చేరతాయి.
ముద్దు ద్వారా వైరస్ ఉన్న వ్యక్తి చేతులతోతాకినప్పుడు ఈ వైరస్ ఒకళ్లనుంచి మరొకళ్లకి చేరవచ్చు. లోపలికి ముక్కు ద్వారా చేరిన వైరస్ శరీరంలోపల వృద్ధి చెంది అనారోగ్య లక్షణాల్ని కలిగిస్తాయి. రోగ నిరోధక శక్తిని బట్టి ఈ లక్షణాలు తీవ్రతరం ఉంటుంది. ఒక్కోసారి నిర్లక్ష్య కారణాన ఈ సాధారణ జలుబు బ్రాంకైటిస్‌లోకిగాని, న్యుమోనియాలోకి గాని దింపవచ్చు. జలుబు కలగకుండా చూసే మందులేవీ లేవు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుని జలుబు రాకుండా కాపాడుకోవచ్చు. జలుబుతో బాధపడుతున్నవాళ్ళు వాడే వస్తువుల్ని వాడకూడదు. పోషకాహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తగా వుండాలి. తరచు చేతుల్ని కడుక్కుంటూ ఉండాలి. చెవి, కళ్ళని, ముక్కుని పదే పదే ముట్టుకోకూడదు. విటమిన్ సితో జలుబు తగ్గిపోతుందనే విషయం ఇంకా పరిశోధనల్లో వుంది. కాకపోతే కొన్ని జలుబుల కణాలు విటమిన్ సిలో నిదానిస్తాయని భావిస్తున్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి