Translate

  • Latest News

    17, సెప్టెంబర్ 2017, ఆదివారం

    బిగ్ బాస్ ఫైనల్ విజేత ఎవరు ?



    బిగ్‌ బాస్‌కు మూలం నెదర్లాండ్స్‌లో ప్రసారం అయిన ‘బిగ్‌ బ్రదర్‌’ రియాలిటీ షో. ఇది ప్రసారం అయిన కొన్నిరోజుల్లోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. ఎంతలా అంటే 40 దేశాలు తమ తమ భాషల్లో.. ఈ షోని రీమేక్‌ చేసుకునేంతగా. 1949లో జార్జ్‌ ఆర్వెల్‌ అనే రచయిత ‘నైన్‌టీన్‌ ఎయిటీఫోర్‌’పేరుతో ఓ నవల రాశాడు. ఒక నియంత తన దేశంలోని ప్రతి పౌరుడి కదలికల మీద నిఘా పెట్టి వాళ్ల వ్యక్తిగత జీవితాలనూ కట్టడి చేస్తుంటాడు. ఈ కథాంశంతో వెలువడ్డ ‘నైన్‌టీన్‌ ఎయిటీఫోర్‌’ నవల ఘనవిజయం సాధించింది. ఈ నవల పబ్లిష్‌ అయిన దాదాపు 50 ఏళ్లకు అంటే 1999లో ‘బిగ్‌ బ్రదర్‌’  రియాలిటీ షో బిగిన్‌ అయింది. ఆ బిగ్‌ బ్రదర్‌ నుంచి మనం ‘బిగ్‌ బాస్‌’ను తెచ్చుకున్నాం. హౌస్‌ ఫుల్‌గా సెలబ్రిటీలు, చుట్టూ కెమెరాలు, ఆ సెలబ్రిటీల మధ్య స్నేహాలు, ప్రేమలు, ఫైటింగ్‌లు, ద్వేషాలు, నమ్మక ద్రోహాలు, డ్రామా.. భారతీయ టీవీ వీక్షకుల కన్నులకు ఇంతకు మించిన పండుగ ఏముంటుంది?

    కలర్స్' టీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షో 'బిగ్ బాస్' ఎంతటి పాపులర్ అయిందో తెలిసిందే. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షో.. ఉత్తరాదికే పరిమితమవలేదు. దక్షిణాదిన.. కన్నడ,తమిళ్ ,తెలుగు లో నూ సంచలనం సృష్టిస్తోంది .
      ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. షో ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా మొత్తం 14 మంది పార్టిసిపెంట్స్‌తో మొదలైన షోలో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్  వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 10 మంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం ఆరుగురు షోలో ఉన్నారు.ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 1 క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇప్పటికి 60 ఎపిసోడ్‌లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 14 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 16న ప్రారంభమైన బిగ్ బాస్ జర్నీ 60 ఎపిసోడ్‌కి వచ్చేసరికి కేవలం ఆరుగురు మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో నవదీప్, దీక్షలు షో మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైనప్పటికీ  మిగిలిన వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. 

    బిగ్‌బాస్‌ హౌస్‌లో మొదట అర్చన, సమీర్, ముమైత్, ప్రిన్స్, మధుప్రియ, సంపూర్ణేష్‌ బాబు, జ్యోతి, కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివబాలాజీ, హరితేజ, ఆదర్శ్‌, ధనరాజ్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో జ్యోతి, సంపూర్ణేష్‌ బాబు, మధు ప్రియ, సమీర్, మహేష్ కత్తి, కల్పన, ధనరాజ్, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నవదీప్, దీక్ష మిగిలిన కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తూ గేమ్‌ ఆడుతున్నారు. వారం వారం కెప్టెన్ ని ఎంచుకునే ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియలతో పాటు బిగ్ బాస్ ఇచ్చే రకరకాల టాస్క్‌లతో బిగ్‌ బాస్‌ హౌస్‌ ఉత్కంఠ రేపుతోంది. ఇక వారానికో సెలబ్రిటీ గెస్ట్‌గా వచ్చి బిగ్‌ బాస్ హౌస్‌లో సందడి చేస్తున్నారు. 

    బిగ్ బాస్ హౌస్‌లో ఓటింగ్ ప్రక్రియ సైతం రంజుగా సాగుతోంది. ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోందని ఎన్టీఆర్ ఇంతకు ముందు చాలా సార్లు చెప్పారు. ప్రతి ఓటును పీడబ్ల్యుసి అనే సంస్థ ద్వారా ఆడిటింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నవదీప్, శివబాలాజీ ఫైనల్‌కి తమ పేరును ఖరారు చేసుకోగా.. ఈ శనివారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో ఆదర్శ్, అర్చన, హరితేజ, దీక్ష ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో? ఎవరు ఫైనల్‌కి చేరతారో? సస్పెన్స్..ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తూ.. గేమ్‌ను ఆడుతున్న వీరిలో బిగ్ బాస్ ఫైనల్ విజేత ఎవరన్నది తెలియాలంటే  వచ్చే ఆదివారం వరకూ వెయిట్ చేయాల్సిందే.  

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బిగ్ బాస్ ఫైనల్ విజేత ఎవరు ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top